గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Acidity home remedies : ఎసిడిటితో బాధపడుతున్నారా..! అయితే ఈ ఇంటి చిట్కాలు మీ సమస్య ఇట్టే మాయం చేస్తుంది..!

Acidity home remedies : అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ప్ర‌స్తుతం చాలా మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో,…

Acidity home remedies : ఎసిడిటితో బాధపడుతున్నారా..! అయితే ఈ ఇంటి చిట్కాలు మీ సమస్య ఇట్టే మాయం చేస్తుంది..!

Acidity home remedies : అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ప్ర‌స్తుతం చాలా మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పైన పేర్కొన్న సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి ఆకులలో ఉండే లక్షణాలు పొట్ట ఉబ్బరం,గ్యాస్ వికారం వంటి వాటికీ తక్షణమే ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని తులసి ఆకులను నోటిలో వేసుకొని నమలవచ్చు. అలాగే రెండు కప్పుల నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని కూడా త్రాగవచ్చు. అదేవిధంగా  తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి  దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతుంది. దాల్చినచెక్క అన్నవాహిక లో ఉండే యాసిడ్స్ ని  సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.  కడుపులో ఉండే గ్యాస్ ను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో అరస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.

Acidity home remedies
Acidity home remedies

ఎసిడిటి వలన వచ్చే కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి వాటిని చాలా సమర్ధవంతంగా తరిమికొట్టే సామర్ధ్యం మజ్జిగకు ఉంది. ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్ లా చేసి గ్లాస్ మజ్జిగలో కలిపి త్రాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదనపు రుచి కోసం కొంచెం నల్ల మిరియాల పొడి, కొత్తిమీర కూడా మజ్జిగలో కలపవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ లో అల్కలిన్ కడుపులో ఆమ్ల చికిత్సకు బాగా సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో రెండు టీ స్పూన్స్ ఆపిల్ సైడర్ లో వెనిగర్ కలిపి త్రాగాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు త్రాగితే కడుపు నొప్పి గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి