గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Today Gold Rate : బ్యాడ్ న్యూస్‌.. పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఎలా ఉన్నాయంటే..?

Today Gold Rate : గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌చ్చాయి. కొన్ని రోజుల పాటు స్థిరంగా కూడా ఉన్నాయి. అయితే తాజాగా బంగారం ధ‌ర‌లు మాత్రం షాకిచ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇన్ని రోజుల పాటు త‌గ్గుతూ…

Today Gold Rate : బ్యాడ్ న్యూస్‌.. పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఎలా ఉన్నాయంటే..?

Today Gold Rate : గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌చ్చాయి. కొన్ని రోజుల పాటు స్థిరంగా కూడా ఉన్నాయి. అయితే తాజాగా బంగారం ధ‌ర‌లు మాత్రం షాకిచ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇన్ని రోజుల పాటు త‌గ్గుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర‌లు శుక్ర‌వారం పెరిగాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం కొనుగోళ్లు, అమ్మ‌కాలు జ‌రుపుతున్నారు. ఇక హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.47,100 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.51,380గా ఉంది. అలాగే విజ‌య‌వాడ‌, వైజాగ్‌ల‌లోనూ రేట్లు ఇదే విధంగా ఉండ‌డం విశేషం.

ఇక దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.47,100 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.51,380గా ఉంది. అలాగే కోల్‌క‌తాలో ఈ ధ‌రలు రూ.47,100, రూ.51,380గా ఉన్నాయి. ముంబై, బెంగ‌ళూరు, కేర‌ళ‌లోనూ ఇలాగే రేట్లు కొన‌సాగుతున్నాయి. చెన్నైలో మాత్రం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.47,670 ఉండ‌గా,, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.52వేలుగా ఉంది.

29 july 2022 Today Gold Rate in India and telugu states
Today Gold Rate

ఇక పూణెలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.47,130, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.51,410గా ఉన్నాయి. కేవ‌లం బంగారం మాత్ర‌మే కాకుండా వెండి ధ‌ర‌లు కూడా శుక్ర‌వారం పెరిగాయి. కిలో వెండి ధ‌ర శుక్ర‌వారం రూ.1900 పెరిగి రూ.56,500 వ‌ద్ద కొన‌సాగుతోంది. హైద‌రాబాద్‌లో అయితే కిలో వెండి ధ‌ర రూ.61,200గా ఉంది. కోల్‌క‌తాలో రూ.56,500, బెంగ‌ళూరులో రూ.61,200, ముంబై, చెన్నైల‌లో రూ.56,500, రూ.61,200గా ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న ఈ ధ‌ర‌లు అక‌స్మాత్తుగా పెర‌గ‌డంతో ఇది మ‌హిళ‌లకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి