గురువారం, జూన్ 11, 2026
వార్తలు

2024 Movie : స్మార్ట్ ఫోన్ తో ఏకంగా సినిమానే తీశారు.. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

2024 Movie : సినిమా తీయాలంటే లక్షల రూపాయలు పోసి ఎన్నో అధునాతనమైన కెమెరాలను వాడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు పోటీపడి మరీ సెల్‌ ఫోన్లలో అధునాతన ఫీచర్లను ఉపయోగించడం వల్ల ఎంతో…

2024 Movie : స్మార్ట్ ఫోన్ తో ఏకంగా సినిమానే తీశారు.. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

2024 Movie : సినిమా తీయాలంటే లక్షల రూపాయలు పోసి ఎన్నో అధునాతనమైన కెమెరాలను వాడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు పోటీపడి మరీ సెల్‌ ఫోన్లలో అధునాతన ఫీచర్లను ఉపయోగించడం వల్ల ఎంతో క్లారిటీగా ఉన్న వీడియోలను చిత్రీకరించే అవకాశం లభిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా కొందరు సినిమా ప్రేమికులు కేవలం సెల్ ఫోన్ లోనే సినిమాని చిత్రీకరించి ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేశారు.

2024 Movie filmed with smart phone

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వన్‌ప్లస్‌ 9 ప్రొ ఫోన్‌ తో 2024 అనే పేరిట రూపొందించిన ఓ ఫీచర్‌ సినిమా 60 నిమిషాల పాటు సాగుతుంది. ఇందులో యాక్షన్ థ్రిల్లర్ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. వన్‌ప్లస్‌, విక్రమాదిత్య మోట్‌వానే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా చూస్తే ఎవరూ కూడా దీన్ని సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు అంటే నమ్మలేరు, అంత అద్భుతంగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి జరిగింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే C-24 అనే వైరస్ ఒక్కసారిగా దేశంలో విజృంభించి ప్రజలను ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి ? ఈ వైరస్ ఎక్కడ పుట్టింది, ఈ వైరస్ ను ఏ విధంగా ఎదుర్కొన్నారు.. అనే అంశాల నేపథ్యంలో.. ఈ సినిమా సాగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి