దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో ఖాళీగా ఉన్న 4,232 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) వారు ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఇందుకు గాను జనవరి 27ను చివరి తేదీగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://scr.indianrailways.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కేటగిరిల వారిగా పోస్టులను చూస్తే ఎస్సీలకు 635, ఎస్‌టీ 317, ఓబీసీలకు 1143, ఈడబ్ల్యూఎస్ 423, యూఆర్ 1714 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌సీఆర్ యూనిట్ ప్రదేశాలను పరిశీలిస్తే.. సికింద్రాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, ఖాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్, నాందెడ్, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్ తదితర చోట్ల ఈ ఖాళీలు ఉన్నాయి.
ఏసీ మెకానిక్ ఖాళీల సంఖ్య 143 ఉండగా, ఎయిర్ కండిషనింగ్ ఖాళీల సంఖ్య 32, కార్పెంటర్ ఖాళీల సంఖ్య 42, డీజిల్ మెకానిక్ ఖాళీల సంఖ్య 142, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఖాళీల సంఖ్య 85, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఖాళీల సంఖ్య 10, ఎలక్ట్రీషియన్ ఖాళీల సంఖ్య 1053, ఎలక్ట్రికల్ (ఎస్ అండ్ టీ) (ఎలక్ట్రీషియన్) ఖాళీల సంఖ్య 10, పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్) ఖాళీల సంఖ్య 34, ట్రైన్ లైటింగ్ (ఎలక్ట్రీషియన్) ఖాళీల సంఖ్య 34, ఫిట్టర్ ఖాళీల సంఖ్య 1742, మోటార్ మెకానిక్ వెహికల్ (ఎంఎంవీ) ఖాళీల సంఖ్య 8, మెషినిస్ట్ ఖాళీల సంఖ్య 100, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం) ఖాళీల సంఖ్య 10, పెయింటర్ ఖాళీల సంఖ్య 74, వెల్డర్ ఖాళీల సంఖ్య 713 గా ఉంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులు అయి ఉండాలి. డిసెంబర్ 28, 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. అభ్యర్థులను 10వ తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…