Non Veg Foods : చాలామంది, శాఖాహారం మాత్రమే తీసుకుంటున్నారు. శాఖాహారం తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మాంసాహారాన్ని పూర్తిగా మానేసి, కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకునే వాళ్ళు కూడా, చాలామంది ఉన్నారు. ఆరోగ్యానికి మాంసాహారం మంచిది కాదని, చాలామంది చెప్తూ ఉంటారు. కానీ, చాలా మంది మాంసాహారాన్ని వదిలిపెట్టలేక మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారాన్ని పూర్తిగా మానేకపోయినా, పరిమితంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
మాంసాహారాన్ని మానేసి పూర్తిగా శాకాహారం తీసుకుంటే, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. రీసెర్చ్ కూడా ఈ విషయాలను వెల్లడించింది. అయితే, పూర్తిగా మాంసాహారాన్ని మానేకపోయినా, ఒక నెలపాటు మాంసాహారాన్ని పక్కన పెట్టేసినా, పూర్తి శాకాహారాన్ని తీసుకుంటే. చక్కటి ఫలితం ఉంటుంది. శాకాహారాన్ని మాత్రమే, ఒక నెలరోజుల పాటు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య చాలామంది, నాన్ వెజ్ తినకుండా శాకాహారులుగా మారిపోతున్నారు. అయితే, దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని, ఫిట్నెస్ ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అయితే, మాంసాహారంలో లభించే పోషకాలు కొన్ని రకాల శాకాహార పదార్థాలలో మనకి ఈజీగా దొరుకుతాయి. ప్రోటీన్ కోసం ఎక్కువ మంది మాంసం తింటూ ఉంటారు.
కానీ కంది, సోయా, బీన్స్, చిక్కుడు వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మాంసాహారంతో పోల్చుకుంటే, శాకాహారం త్వరగా జీర్ణం అయిపోతుంది. గట్ హెల్త్ కి ఇది బాగా మేలు చేస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు రాకుండా కూడా శాకాహారం చూసుకుంటుంది. మాంసాహారం తీసుకునే వాళ్ళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో రక్తపోటు గుండెపోటు వంటివి కలుగుతుంటాయి. అలానే, హృదయ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పూర్తిగా శాకాహారం తీసుకుంటే ఎటువంటి బాధలు ఉండవు.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్‌ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…