ఆరోగ్యం

Virasana Benefits : రోజూ ఈ ఆస‌నాన్ని 5 నిమిషాలపాటు వేసినా చాలు.. అన్ని ర‌కాల నొప్పులు త‌గ్గుతాయి..!

Virasana Benefits : మారిన మన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒకేచోట క‌ద‌ల‌కుండా కూర్చుని ప‌ని చేయ‌డం వంటి కార‌ణాల చేత ఈ స‌మస్యుల త‌లెత్తుతున్నాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను, స్ప్రేల‌ను వాడుతూ ఉంటారు. వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం అంత మంచిది కాదు. ఇలా మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పులు, న‌డుము నొప్పి వంటి వాటితో బాధ‌ప‌డే వారు పెయిన్ కిల్ల‌ర్ ల‌కు బ‌దులుగా ఆస‌నం వేయ‌డం వ‌ల్ల నొప్పి నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు విరాసనం వేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని ఈ ఆస‌నం వేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు మ‌రెన్నో ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని యోగా నిపుణులు చెబుతున్నారు. విరాసనం ఎలా వేయాలి… దీని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇత‌ర ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. విరాసనం వేయ‌డానికి గానూ ముందుగా వ‌జ్రాస‌న స్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు మోకాళ్ల‌ను ద‌గ్గ‌ర‌గా ఉంచి అరికాళ్ల‌ను దూరంగా చాపి కూర్చోవాలి. త‌రువాత ఊపిరి పీల్చుకుంటూ న‌డుమును నిటారుగా ఉంచాలి. అలాగే భూజాల‌ను రిలాక్స్ ఉంచి అర చేతుల‌ను తొడ‌ల‌పై ఉంచాలి. ఇలా ఒక నిమిషం పాటు ఉండి మ‌ర‌లా రిలాక్స్ అయ్యి మ‌ర‌లా ఆస‌నం వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అంతేకాకుండా ఈ విరాస‌నం వేయ‌డం వ‌ల్ల అజీర్ణం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌వ‌మ‌నం క‌లుగుతుంది.

Virasana Benefits

ఆహారం తిన్న త‌రువాత ఈ ఆస‌నాన్ని 5 నిమిషాల పాటు వేయ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే విరాసనం వేసి దీర్ఘ‌శ్వాస తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నిరాశ‌, ఒత్తిడి, డిప్రెష‌న్, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా ఒత్తిడిగా ఉన్న‌ప్పుడు ర‌క్త‌నాళాల‌పై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది. దీంతో ఆరోగ్యం దెబ్బ‌తిన‌డంతో పాటు అధిక ర‌క్త‌పోటు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. ఇలా ఒత్తిడి స‌మ‌స్య‌ల‌తో బాధపడే వారు విరాస‌నం వేయ‌డం వల్ల ఒత్తిడి త‌గ్గి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ విధంగా రోజూ విరాస‌నం వేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి త‌గ్గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM