Red Amaranth : చాలామంది ఆరోగ్యంగా ఉండటం కోసం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఆకుకూరలు చాలా సమస్యల్ని తొలగిస్తాయి. ఆకుకూరలని తీసుకోవడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఆకుకూరలతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎర్ర తోటకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది ఎర్ర తోటకూరని తీసుకోరు. కానీ నిజానికి ఎర్ర తోటకూర వలన చాలా లాభాలు ఉంటాయి. ఎర్ర తోటకూరని తీసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది..?, ఏయే సమస్యలకి దూరంగా ఉండొచ్చు.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర తోటకూరతో చాలా సమస్యలు తొలగిపోతాయి. ఎర్ర తోటకూరలో విటమిన్ ఏ తోపాటు విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఎర్ర తోటకూరను తీసుకుంటే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. ఎర్ర తోటకూరని కనుక తిన్నట్లయితే పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్ర తోటకూరని తరచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది.
స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. క్యాల్షియం ఇందులో ఉంటుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేట్టు ఇది చూస్తుంది. సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ని కూడా తగ్గిస్తుంది. వాటితో ఇది పోరాడుతుంది. గొంతు క్యాన్సర్ రాకుండా ఎర్ర తోటకూర సహాయం చేస్తుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉండాలంటే ఎర్ర తోటకూరని తీసుకోవడం మంచిది. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు ఎర్ర తోటకూరని తీసుకున్నట్లయితే రక్తపోటు స్థాయిలని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ తోటకూరలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఓట్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. శాకాహారులు మంచి ప్రోటీన్ కోసం చూస్తున్నట్లయితే ఈ తోటకూరను తీసుకోవడం మంచిది. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి కూడా ఎర్ర తోటకూర సహాయం చేస్తుంది. వృద్ధాప్య రుగ్మతలను తగ్గిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యల్ని కూడా ఇది తొలగిస్తుంది. ఇలా ఎర్ర తోటకూరని తీసుకోవడం వలన అనేక లాభాలను పొంది చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…