ఆరోగ్యం

ప్రసవం తర్వాత బరువు తగ్గాలంటే పైనాపిల్ తినొచ్చా? గైనకాలజిస్ట్ సమాధానం!

బరువు తగ్గడంలో పైనాపిల్ ప్రభావం. Photo Credit: 1mg.

మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు శరీరంలో వచ్చే మార్పులు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. నడుము వెడల్పు పెరగడం, పాదాల పరిమాణం మారడం, జుట్టు రాలడం, వెజైనల్ డిశ్చార్జ్ (లోకియా), మలబద్ధకం, చర్మంపై స్ట్రెచ్ మార్కులు వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత పెరిగిన బరువు మహిళలకు ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో సరైన ఆహారంపై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. బరువు తగ్గడానికి ఉపయోగపడే పండ్లలో పైనాపిల్ ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ అధికంగా ఉండడం వల్ల ఇది బరువు నియంత్రణకు సహకరిస్తుంది. అయితే పరిమితిలోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.

పోష‌కాహారం ముఖ్యం..

మదర్‌హుడ్ హాస్పిటల్స్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ మాన్సీ శర్మ మాట్లాడుతూ పైనాపిల్‌లో క్యాలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే బ్రోమెలైన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో వాపును తగ్గిస్తుంది, మెటబాలిజానికి మద్దతిస్తుంది. సమతుల్య ఆహారంలో భాగంగా పైనాపిల్‌ను చేర్చుకుంటే గర్భధారణ తర్వాత బరువును నియంత్రించుకోవడానికి సహాయపడుతుంద‌ని తెలిపారు. డెలివరీ అనంతరం బరువు తగ్గాలా లేక ఆరోగ్యకరమైన ఆహారంతో శరీరాన్ని స్థిరంగా ఉంచాలా అనే అంశంపై మహిళల్లో చాలాసార్లు సందేహం ఉంటుంది. అయితే బరువు తగ్గే ప్రక్రియ శరీర శక్తి స్థాయిలపై, హార్మోన్లపై, శరీర పునరుద్ధరణపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ దశలో తొందరపడి కఠినమైన డైట్లు కాకుండా, సరైన పోషకాహారమే ముఖ్యమని చెబుతున్నారు.

మంత్రంలా కొవ్వును కరిగించ‌క‌పోయినా..

డైటీషియన్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ డాక్టర్ అర్చనా బాత్రా మాట్లాడుతూ పైనాపిల్‌ నేరుగా కొవ్వును క‌రిగించ‌దు. కానీ తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటి శాతం, బ్రోమెలైన్ వంటి అంశాల వల్ల ఆకలి నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడుతుంది. నిజమైన కొవ్వు తగ్గుదల మొత్తం క్యాలరీల సమతుల్యత, హార్మోన్ల ఆరోగ్యం, నిద్ర, శారీరక చురుకుదనం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత.. అని వివరించారు. పైనాపిల్ లో ఫైబర్, విటమిన్ సి, బ్రోమెలైన్ అధికంగా ఉంటాయి. ఇవి అనవసరమైన తినుబండారాలపై ఆసక్తిని తగ్గించి, కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే తీపి రుచి ఉండడం వల్ల ప్రాసెస్ చేసిన స్వీట్లపై ఆకర్షణ తగ్గుతుంది. అయితే ఇవన్నీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు సహకరించేవే తప్ప, మంత్రంలా కొవ్వును కరిగించేవి కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇలా తీసుకోవ‌చ్చు..

కొత్తగా తల్లైన మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పైనాపిల్‌ ఆమ్ల స్వభావం కలిగి ఉండటంతో ఖాళీ కడుపుతో లేదా అధికంగా తీసుకుంటే అసిడిటీ, జీర్ణ సమస్యలు రావచ్చు. పాలిచ్చే తల్లులు ఎక్కువగా తీసుకుంటే శిశువులకు కడుపు నొప్పులు రావచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పరిమితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పైనాపిల్ ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం సురక్షితమే. పెరుగులో కొన్ని ముక్కలు కలపడం, స్మూతీలో విత్తనాలతో కలిసి మిక్స్ చేయడం, భోజనం తర్వాత ఫ్రూట్ బౌల్‌గా తినడం మంచి మార్గాలు. రోజుకు ఒక చిన్న గిన్నె పరిమాణం సరిపోతుంది. గర్భధారణ తర్వాత బరువు తగ్గడంలో పైనాపిల్ సహాయకారిగా ప‌నిచేస్తుంది. కానీ అదే ఒక్కటే పరిష్కారం కాదని, సమతుల్య ఆహారం, సరైన విశ్రాంతి, తేలికపాటి వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అన్నింటికన్నా ముఖ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గ‌మనిక‌: ఇవన్నీ సాధారణ సమాచారం కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులు లేదా పోషకాహార‌ నిపుణుల సలహా తీసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM