Liver : చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వంటి వాటితో బాధపడుతున్నారు. అయితే లివర్ ఆరోగ్యాన్ని కొన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. మరి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కాలేయం జీవక్రియ, జీర్ణక్రియ, పోషకాలను నిల్వ చేయడం వంటి పనులను చేస్తుంది. కనుక కచ్చితంగా కాలేయ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు మరి ఎటువంటి వాటి వలన కాలేయం దెబ్బతింటుంది అనేది తెలుసుకుందాం.
ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ ఇంకా చాలామంది స్మోకింగ్ చేస్తున్నారు. అయితే స్మోకింగ్ వలన లివర్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కాలేయ క్యాన్సర్, హెపటైటిస్ వంటి ప్రమాదకరమైన సమస్యల్ని తీసుకువస్తుంది. కాబట్టి ధూమపానాన్ని మానేయండి. అలాగే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ వలన కాలేయం దెబ్బతింటుంది.
అధిక ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నాలుగు నెలల్లోనే కాలేయ వ్యాధి సంభవిస్తుంది. యాంటీ డిప్రెసెంట్ మందులు వలన కూడా కాలేయం బాగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. చక్కెరని ఎక్కువగా తీసుకోవడం వలన కూడా కాలేయంపై ప్రభావం పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కాలేయం వల్ల కలిగే నష్టం మద్యం వల్ల కలిగే నష్టం కంటే ఎక్కువ.
కాబట్టి షుగర్ ఎక్కువ తీసుకోవద్దు. చాలామంది హెర్బల్ సప్లిమెంట్స్ సహజమైనవి కనుక మేలు చేస్తాయి అని అనుకుంటుంటారు. కానీ హెర్బల్ సప్లిమెంట్స్ కూడా లివర్ పై ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైనా ఏదైనా మూలికలని తీసుకునే ముందు కూడా వైద్యుడిని సంప్రదించండి. అలాగే కృత్రిమ పానీయాలు వంటివి కూడా తీసుకోవద్దు. ఉబకాయం వలన కూడా కాలేయం దెబ్బతింటుంది. అధిక స్థాయిలో విటమిన్ ఎ వలన కాలేయం దెబ్బ తినవచ్చు. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవడం మంచిది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…