Health : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పినవి లేదంటే ఎక్కడైనా చదివినవి పాటిస్తూ ఉంటారు. ఈ ఆరోగ్య చిట్కాలను కనుక పాటించారంటే మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. పైగా చిటికెలో పలు సమస్యలని మనం దూరం చేసుకోవచ్చు. ఈ అనారోగ్య సమస్యలకి చిటికెలో పరిష్కారం కనబడుతుంది. కడుపు నొప్పిగా ఉంటే ఇంగువ నీళ్లు కొంచెం బొడ్డు మీద ఉంచండి. ఇలా చేయడం వలన కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
కడుపునొప్పితో బాధపడే వాళ్ళు 10 గ్రాములు యాలకుల పొడిని నీళ్లల్లో కలిపి కానీ లేదంటే యాలకులని నానబెట్టి గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. చాలామంది చేదుగా ఉంటుందని కాకరకాయని దూరం పెడుతూ ఉంటారు. కనీసం వారానికి ఒక్కసారైనా కాకరకాయను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా కనీసం నెలకి ఒక సారి ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేయడం మంచిది. అలా చేయడం వలన చర్మ సమస్యలు రావు.
పైగా పసుపు రాసుకుని స్నానం చేస్తే శరీరం మీద ఉండే అవాంచిత రోమాలు పోతాయి. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి పసుపు రాసుకుని స్నానం చేస్తే ఇంకా మంచిది. కళ్ళ కలకలు వచ్చినట్లయితే దూదిని ధనియాలని నానబెట్టిన నీళ్లల్లో ముంచి కళ్ళని తుడిస్తే చక్కటి రిలీఫ్ ని పొందొచ్చు.
తులసి ఆకుల రసాన్ని కనుక కంటి మీద రాస్తే కళ్ళు నీరు కారడం, కళ్ళ మంటలు వంటి బాధల నుండి బయటపడొచ్చు. కాలిన మచ్చలకి తేనె రాస్తే మచ్చలు అన్నీ కూడా సులభంగా పోతాయి. కాళ్లు, చేతులు బెణికితే ఉప్పుతో కాపడం పెడితే ఉపశమనంగా ఉంటుంది. ఇలా ఈ సమస్యలకి సులభంగా పరిష్కారాన్ని పొందవచ్చు.
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…