ఆరోగ్యం

Pimples : ఈ పేస్ట్ రాసుకుంటే ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌లు పోతాయి..!

Pimples : మొటిమ‌లు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా ఈ స‌మ‌స్య అంద‌రిని వేధిస్తూ ఉంటుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం, వాతావ‌ర‌ణ కాలుష్యం, చ‌ర్మంపైమృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల చేత మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి. అలాగే ఈ మొటిమ‌లు కొన్ని సార్లు నొప్పిని కూడా క‌లిగిస్తూ ఉంటాయి. అలాగే మొటిమ‌లు ఏర్ప‌డిన చోట మ‌చ్చ‌లు, గుంత‌లు ప‌డుతూ ఉంటాయి. ముఖంపై మొటిముల రావ‌డం వ‌ల్ల మ‌నకు ఎటువంటి న‌ష్టం క‌ల‌గ‌దు. అయితే వీటి వ‌ల్ల ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. క‌నుక మొటిమల‌ను తొల‌గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ర‌క‌ర‌కాల ఫేస్ వాష్ ల‌ను వాడుతూ ఉంటారు.

అయితే ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ముఖంపై వ‌చ్చే మొటిమ‌ల‌ను అలాగే వాటి వ‌ల్ల క‌లిగే మ‌చ్చ‌లను, గుంత‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గాను న‌ల్ల మ‌ట్టిని తీసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా న‌లగొట్టి జ‌ల్లించాలి. ఇలా జల్లించ‌గా వ‌చ్చిన మెత్త‌ని మ‌ట్టిని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ న‌ల్ల‌మ‌ట్టిని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. త‌రువాత దీనిని పూర్తిగా ఆరిన త‌రువాత ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి. న‌ల్ల‌మ‌ట్టిని ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం చ‌ల్ల‌బ‌డుతుంది. చ‌ర్మం చ‌ల్ల‌బ‌డ‌డం వ‌ల్ల ముఖానికి ర‌క్తం చ‌క్క‌గా స‌ర‌ఫ‌రా అవుతుంది.

Pimples

అలాగే ముఖ చ‌ర్మంలో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోతాయి. చ‌ర్మంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది. ఈ విధంగా ముఖానికి మ‌ట్టితో ప్యాక్ ను వేసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది. అలాగే ఈచిట్కాను పాటించ‌డంతో పాటు నీటిని ఎక్కువ‌గా తాగాలి. తాజా పండ్ల‌తో చేసిన జ్యూస్ ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల వ‌ల్ల క‌లిగే గుంత‌లు త్వ‌ర‌గా తొల‌గిపోతాయి. వీటితో పాటు మొటిమ‌ల‌ను గిల్ల‌కూడ‌దు. వాటంత‌ట అవి ప‌గిలే వార‌కు వాటిని ముట్టుకోకూడ‌దు. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మొటిమ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ ఇండస్ట్రీ కళ్లు తెరిపించింది.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేస్తూ ఘ‌న విజ‌యం సాధించి ముందుకు సాగుతున్న…

Wednesday, 25 March 2026, 12:27 PM

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM