Cheepuru : ప్రతి ఒక్కరూ కూడా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే, ఏ సమస్యలు ఉండవు. సంతోషంగా ఉండవచ్చు. అయితే, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, చీపురు ఉంటుంది. చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తాం. హిందూ ఆచారాల ప్రకారం, చీపురికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. చీపురు కాళ్ళకి తగిలితే, చేతితో మొక్కుతాము. ఇంటిని శుభ్రం చేయడానికి వాడే చీపురుని, లక్ష్మీదేవిగా భావించి, లక్ష్మీదేవికి సంబంధించినదిగా చూస్తాము. చీపురు విషయంలో, ఎంతో జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అదేవిధంగా, సమయపాలన లేకుండా అసలు చీపురుతో తుడవకూడదు అని కూడా వాస్తు పండితులు అంటున్నారు. ఇలా ఇల్లు ఊడ్చితే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని, దరిద్రం పట్టుకుంటుందని వాస్తు నిపుణులు చెప్పడం జరిగింది. చీపురు విషయంలో, కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసే చీపురుని, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. చీపురుపై బయట వ్యక్తుల చూపు అసలు పడకూడదు. తులసికోట, పూజ గది, డబ్బులు దాచుకునే చోటుల్లో చీపురుని అసలు పెట్టకూడదు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చీపురుని అసలు ఉపయోగించకూడదు.
ఆ సమయాల్లో, చీపురుతో ఎటువంటి పనులు కూడా చేయకూడదు. ఎప్పుడూ కూడా తెల్లవారుజామున, సూర్యోదయం తర్వాతే చీపురుతో శుభ్రం చేయాలి. అలానే, సూర్యాస్తమయానికి ముందే శుభ్రం చేసుకోవాలి. చీకటి పడ్డాక ఇల్లు ఊడిస్తే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దరిద్ర దేవత అక్కడ తిష్ట వేస్తుంది.
సూర్యోదయానికి ముందు, అలానే, సూర్యాస్తమయానికి తర్వాత అసలు చీపురుతో శుభ్రం చేయొద్దు. ఎవరైనా, ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కూడా వెంటనే తుడవద్దు. పాత చీపురుని ఎక్కడపడితే అక్కడ పాడేయకూడదు. సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే పాత చీపురులని పాడేయాలి. ఇలా ఈ విషయాలను జాగ్రత్తగా పాటించండి లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…