గురువారం, జూన్ 11, 2026
ముఖ్య‌మైన‌వి

Pesticides On Vegetables : కూరగాయలపై రసాయనాలను తొలగించడానికి 5 సులువైన పద్దతులు..!

Pesticides On Vegetables : కూరగాయ‌లు, ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో ఒక భాగం. అధిక దిగుబడి కోసం ప్ర‌స్తుతం రసాయన ఎరువుల‌ వాడకం ఎక్కువయింది. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కూడా రకరకాల…

Pesticides On Vegetables : కూరగాయలపై రసాయనాలను తొలగించడానికి 5 సులువైన పద్దతులు..!

Pesticides On Vegetables : కూరగాయ‌లు, ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో ఒక భాగం. అధిక దిగుబడి కోసం ప్ర‌స్తుతం రసాయన ఎరువుల‌ వాడకం ఎక్కువయింది. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కూడా రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. వాటిని డైరెక్ట్ గా తీసుకుంటే అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అలా కాకుండా కూరగాయ‌లపై ఉండే ర‌సాయ‌నాల‌ను క్లీన్ చేయ‌డానికి ప‌లు మార్గాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలామంది చల్లని నీటిలో కూరగాయలను వేసి కడుగుతారు. చల్లని నీటిలో వేసినప్పటికీ వాటిని బాగా రుద్దితేనే కూరగాయలపై ఉన్న రసాయనాలను తొలగించగలుగుతాం. కూరగాయలపై ఉండే ర‌సాయ‌నాల‌ను క్లీన్ చేయడానికి ఉప్పు నీరు మనకు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు వేసి అరగంట పాటు కూరగాయలను అందులో వేసి ఆ తర్వాత వాడుకుంటే ర‌సాయ‌నాలు సమూలంగా తొలగిపోతాయి. కూరగాయలపై ర‌సాయ‌నాల‌ను తొలగించడానికి వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఒక కప్ వెనిగర్ చేర్చి ఆ వాటర్ లో కూరగాయలు నానబెట్టి అరగంటయ్యాక వాడుకోవాలి.

Pesticides On Vegetables how to remove them 5 easy methods
Pesticides On Vegetables

ఎక్కువ టైం లేని వాళ్లు ఒక టీస్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల వెనిగర్, ఒక కప్ వాటర్ లో కలుపుకుని స్ప్రే బాటిల్ ల్ నింపుకోవాలి. కూరగాయలు కట్ చేసుకునే ముందు ఆ మిశ్రమాన్ని కూరగాయలపై స్ప్రే చేసి వెంటనే కట్ చేసుకోవచ్చు. పండ్లు కానీ, కూరగాయలకు కానీ పైన‌ తొక్క తీసి వాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కానీ అన్నింటినీ అలా వాడుకోవడం అనేది సాధ్యం కాదు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌లు, పండ్లు ఏవైనా స‌రే బాగా క‌డిగిన త‌రువాతే తిన‌డం శ్రేయ‌స్క‌రం. లేదంటే ర‌సాయ‌నాల బారిన ప‌డి మ‌నం తీవ్ర ప‌రిమాణాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక వాటిని త‌ప్ప‌నిస‌రిగా బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి