ముఖ్య‌మైన‌వి

Children Names : మ‌గ పిల్ల‌ల‌కు స‌రిసంఖ్య అక్ష‌రాల‌తో, ఆడ‌పిల్ల‌ల‌కు బేసి సంఖ్య‌లో అక్ష‌రాల‌తో పేర్లు ఎందుకు పెట్టాలో తెలుసా..?

Children Names : పిల్ల‌లు పుట్ట‌గానే కాదు.. త‌ల్లిదండ్రులకు అస‌లు స‌మ‌స్య ఎప్పుడు వ‌స్తుందో తెలుసా..? వారికి పేర్లు పెట్ట‌డంలో వ‌స్తుంది. అవును, ఆ స‌మ‌యంలోనే త‌ల్లిదండ్రులు చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంటారు. ఏం పేరు పెట్టాలి..? ఏం పేరు పెడితే బాగుంటుంది..? అన్న సందేహాలు వారిలో ఉత్ప‌న్న‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే వారు ఇత‌రుల‌ను స‌ల‌హాలు అడుగుతారు. పేర్ల పుస్త‌కాలు తిర‌గేస్తారు. వారు చెప్పింది, వీరు చెప్పింది వింటారు. చివ‌ర‌కు ఏదో ఒక పేరుకు ఫిక్స‌యి అదే పెడ‌తారు. అయితే అలా పేరు పెట్టేలోపే నిక్ నేమ్ అప్ప‌టికే చెలామ‌ణీలో ఉంటుంది క‌నుక పేరు పెట్టినా దాంతో పిల‌వ‌రు. నిక్ నేమ్‌, ముద్దు పేర్ల‌తోనే పిలుస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? హిందూ శాస్త్రాల ప్ర‌కారం పిల్ల‌ల‌కు పేర్లు ఎలా పెట్టాలో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్ల‌ల‌కు పేర్లు పెట్ట‌డంలో కొన్ని నియ‌మాల‌ను శాస్త్రాలు సూచిస్తున్నాయి. అవేమిటంటే.. పిల్ల‌లు పుట్టిన 11వ రోజున‌, 21వ రోజున‌, 26వ రోజున పేరు పెట్టాలి. వారి జ‌న్మ న‌క్ష‌త్రం, రాశి ప్ర‌కారం పేరు పెట్టాలి. రుషులు, ప‌ర్వ‌తాలు, న‌దులు, చెట్లు, రాక్ష‌సులు, ఉగ్ర దేవ‌త‌ల‌ పేర్లు పెట్ట‌రాదు. మాతృభాష‌లోనే పేరు పెట్టాలి. స‌ర‌ళ‌మైన ప‌దాలు పేరులో ఉండాలి. క‌ఠిన‌మైన ప‌దాలు ఉండ‌రాదు. అంటే రెండో అక్ష‌రాలతో వ‌చ్చే పేర్ల‌ను పెట్ట‌రాదు. ఉదాహ‌ర‌ణ‌కు.. ఖ‌, ఘ‌, ఛ‌, ఠ‌, ఢ‌, ణ‌, థ‌, ధ‌, ఫ‌, భ ఇలా అన్న‌మాట‌. ఇలా రెండో అక్ష‌రంతో వ‌చ్చే పేర్లను పెట్ట‌రాదు. స‌ర‌ళంగా ప‌దాలు ఉండాలి.

Children Names

మ‌గ‌పిల్ల‌ల‌కు స‌రి సంఖ్య‌లో ప‌దాలు వ‌చ్చేలా పేర్లు పెట్టాలి. ఉదాహ‌ర‌ణ‌కు హ‌రి, నారాయ‌ణ.. ఇలా అన్న‌మాట‌. ఆడ‌పిల్ల‌ల‌కు బేసి సంఖ్య‌లో ప‌దాలు వ‌చ్చేలా పేర్లు పెట్టాలి. ఉదాహ‌ర‌ణ‌కు అనిత‌, స‌రిత‌, క‌విత.. ఇలా అన్న‌మాట‌. దేవుళ్లు, దేవ‌త‌ల పేర్ల‌ను పిల్ల‌ల‌కు పెడితే వారిని పేరుతో దూషించరాదు. పెద్ద‌వారి పేర్ల‌ను పిల్ల‌ల‌కు పెట్టినా వారిని తిట్ట‌రాదు. అంతా బాగానే ఉంది. అయితే మ‌గ పిల్ల‌ల‌కు స‌రి సంఖ్య‌లో, ఆడ పిల్ల‌ల‌కు బేసి సంఖ్య‌లో ప‌దాలు వ‌చ్చేలా పేర్లు ఎందుకు పెట్టాలి.. అందులో ప్రాముఖ్య‌త ఏముంది..? అంటే..

అవును ఉంది. నిజానికి లింగం ప్ర‌కారం మ‌నుషుల్లో ఆడ‌, మ‌గ ఉన్న‌ప్ప‌టికీ ఆడ‌వారిలో కొన్ని మ‌గ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అలాగే మ‌గ‌వారిలో కొన్ని ఆడ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇక సంఖ్యాశాస్త్రం ప్ర‌కారం స‌రి సంఖ్య‌ల‌ను ఆడ సంఖ్య‌లుగా పేర్కొంటారు. అదే బేసి సంఖ్య‌ల‌ను అయితే మ‌గ సంఖ్య‌ల‌ని అంటారు. క‌నుక మ‌గ‌వారిలో ఉండే ఆడ ల‌క్ష‌ణాల‌ను బ్యాలెన్స్ చేయాలంటే ఆడ ల‌క్ష‌ణం క‌లిగిన సరి సంఖ్య ప‌దాల‌ను పేర్లుగా పెట్టాలి. అదే ఆడ‌వారిలో ఉండే మ‌గ ల‌క్ష‌ణాల‌ను బ్యాలెన్స్ చేయాలంటే వారికి మ‌గ సంఖ్య ప‌దాల‌ను.. అంటే బేసి సంఖ్య ప‌దాల‌ను పేర్లుగా పెట్టాలి. అందుకే మ‌గ‌పిల్ల‌ల‌కు అయితే 2, 4, 6, 8 సంఖ్యలో అక్ష‌రాలు వ‌చ్చేలా పేర్లు పెట్టాల్సి ఉంటుంది. అదే ఆడ‌వారికైతే 3,5,7,9 సంఖ్య‌లో అక్ష‌రాలు వ‌చ్చేలా పేర్లు పెట్టాలి. ఇవీ.. పిల్ల‌ల‌కు పేర్లు పెట్ట‌డం వెనుక ఉన్న అస‌లు నియ‌మాలు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM