Vishal : కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోను ఆయనకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ‘మార్క్ ఆంటోనీ’ అనే టైం ట్రావెల్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న విశాల్.. ప్రస్తుతం ‘రత్నం’, ‘డిటెక్టివ్ 2’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, విశాల్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఆ వీడియోలో అమ్మాయితో కలిసి విశాల్ నడుస్తూ వెళ్తుండగా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో తీయడం చూసిన విశాల్ తన హుడీతో మొహాన్ని కప్పేసుకుని పరిగెత్తారు. 10 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ…‘న్యూయార్క్ సిటీలో ఎవరో వ్యక్తితో నటుడు విశాల్ నడుచుకుంటూ వెళ్తున్నారా’ అని అనుమానాస్పదంగా అడుగుతున్నట్టు రమేష్ బాల క్యాప్షన్ పెట్టారు.
దీంతో విశాల్‌తో ఉన్న అమ్మాయి ఎవరు అని తెగ ఆరాలు తీసారు.తదుపరి సినిమా ప్రమోషన్ కోసమే విశాల్ ఇలా చేశారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేసారు.. విశాల్ రియాక్ట్ అయిన తీరును చూస్తే ఇదంతా కావాలనే చేసినట్టుగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఎట్టకేలకు దీనిపై విశాల్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.ఆ వీడియోలో ఉన్నది తానేనని , అది న్యూయార్క్ సిటీనే అని కాకపోతే ఇది ఒక ప్రాంక్ అని అసలు విషయం వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందరూ క్షమించాలి అంటూ , తాజా వీడియో వెనక ఉన్న నిజం ఏంటో చెప్పే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. లొకేషన్ ప్రకారం చూసుకుంటే ఇందులో సగం నిజముంది.
నేను తరుచూ నా కజిన్స్‌తో సరదాగా గడిపే ప్రదేశం అది. నాలోని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడికి వెళ్తాను. ఏడదంతా కష్టపడిన తర్వాత ఇక్కడికి వెళ్లి ఆనందంగా గడుపడం నాకు ఇష్టం. ఇంక ఈ వీడియోలో దాగి ఉన్న మిగిలిన సగం నిజం ఏంటంటే.. క్రిస్మస్ రోజున ఈ ప్రాంక్ చేయాలని నా కజిన్స్ డిసైడ్ చేశారు. ఈ వీడియోకు దర్శకత్వం వహించడంతో పాటు దీన్ని బయటికి తీసుకొచ్చింది నా కజిన్సే. నాలోని చిన్నపిల్లాడిని బయటకు తీసుకురావడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి అనుభూతి అని విశాల్ అన్నాడు. మీ డిటెక్టివ్ ఊహాగానాలకు ముగింపు కూడా పలుకుతున్నాను. కొంతమంది నన్ను టార్గెట్ చేసి ఏవేవో అన్నారు. అవన్నీ పట్టించుకోను. లవ్ యు ఆల్’ అని విశాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…