Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అందాల భామ ఒకప్పుడు టాలీవుడ్‌లో కూడా చాలా సూపర్ హిట్ చిత్రాలలో నటించి అలరించంది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌కి పరిమితం అయింది. రీసెంట్‌గా త్రిష పేరు ఎక్కువగా వినిపించింది. ఆమెని రేప్ చేస్తానని మన్సూర్ అలీ ఖాన్ కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున త్రిషకి మద్దతు లభించింది. మన్సూర్ కామెంట్ పై త్రిష కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన దిగొచ్చి క్షమాపణలు చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే త్రిష ఇప్పుడు 40 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ కుర్రభామ మాదిరిగానే ఉంది.
త్రిష వయస్సు 40 ఏళ్లు దాటడంతో కొందరు నెటిజన్స్ ఆమెపై వ్యంగాస్త్రాలు చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా హీరోయిన్ గా త్రిషకి అవకాశాలు రావడంపై సోషల్ మీడియాలో కొందరు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. చాలా కాలం ఆ ట్రోల్స్ విన్న త్రిష స్పందించలేదు. కాని ఇప్పుడు గట్టిగా సమాధానం ఇచ్చింది.ఇప్పుడు నా వయసు జాతీయ సమస్యగా మారింది. నాకు నలభై నిండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్టు ఉంది.. వీళ్లు రాసే రాతలు, వీడియోలు అలాగే ఉన్నాయి మరి. వేరే సమస్యే లేనట్టు చివరకు నా వయసు గురించి పిచ్చి రాతలు రాయడం.. సిగ్గనిపించడంలేదా?’ అంటూ కొన్ని ప్లాట్‌ఫాంస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘బుద్ధిలేనివాళ్లు చేసే న్యూసెన్స్ ఇది. మొదట్లో పట్టించుకోకూడదనే అనుకున్నా. కానీ ఆగేలా లేవు. అందుకే మాట్లాడుతున్నా. భారతీయ సినీ పరిశ్రమలో 40 దాటిన కథానాయికలు చాలామంది ఉన్నారు. నేనే ప్రథమం కాదు. నాకు ఇప్పటికీ అవకాశాలు రావడం కొందరికి మింగుడుపడడం లేదన్నట్టుగా ఉంది అందుకే పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను నటిని. చనిపోయేదాకా నటిస్తూనే ఉంటా. నటనకు వయసుతో నిమిత్తంలేదు. ఆ మాత్రం కామన్‌సెన్స్ లేకపోతే ఎలా? నా అందం, నా అభినయసామర్థ్యం నాకు గర్వకారణాలు’ అంటూ భావోద్వేగంగా త్రిష మాట్లాడింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…