వినోదం

Tollywood Releases This Week : ఈ వారం థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఏవో తెలుసా..?

Tollywood Releases This Week : చూస్తుండ‌గానే 2023 సంవ‌త్స‌రం ముగిసిపోతుంది. ఏడాది చివ‌రిలో ప్రేక్ష‌కులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. డిసెంబర్‌ మొదటివారంలో ) పలు చిత్రాలో థియేటర్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అంద‌రి దృష్టి రణ్‌బీర్‌ కపూర్ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ . రష్మిక మందన్నా కథానాయిక. బాబీ దేవోల్‌ విలనగా కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ ఒకటో తేదీన హిందీ, తెలుగు, భాషల్లో విడుదల కానుంది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

యానిమ‌ల్ సినిమాని తెలుగులోను భారీ ఎత్తున ప్ర‌మోట్ చేస్తున్నారు.ఈ క్ర‌మంలో తెలుగులోను ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే యానిమ‌ల్‌కి పోటీగా ప‌లు తెలుగు సినిమాలు విడుద‌ల అవుతున్నా కూడా వాటిపై పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఇది యానిమ‌ల్ సినిమాకి చాలా క‌లిసొచ్చే అంశంగా చెప్పుకోవ‌చ్చు. సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన కాలింగ్ స‌హ‌స్ర చిత్రం క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందగా, ఈ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అరుణ్ విక్కీరాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో డాలీషా హీరోయిన్‌గా న‌టించింది.

Tollywood Releases This Week

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్‌ సుభాన ఎస్‌.కె తెరకెక్కించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. ‘కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన మాస్‌ చిత్రమిది. డిసెంబర్‌ 1న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. కార్తిక్‌రాజు కథానాయకుడిగా తెరకెక్కుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అథర్వ’. సిమ్రాన్‌ చౌదరి, ఐరా కథానాయికలు మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి నిర్మించారు. ‘ఇదొక భిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ కథ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. వచ్చే నెల ఒకటో తేదిన చిత్రం విడుదల కానుంది. నంద‌మూరి చైత‌న్య కృష్ణ బ్రీత్ డిసెంబ‌ర్ 2న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాల‌తో పాటు విజ‌య్ ఆంటోనీ డ‌బ్బింగ్ మూవీ విక్ర‌మ్ రాథోడ్ ఈ ఫ్రైడే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM