వినోదం

Kantara Chapter 1 First Look : భ‌య‌పెట్టిస్తున్న‌రిష‌బ్ శెట్టి లుక్.. కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ అదిరిందిగా..!

Kantara Chapter 1 First Look : చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం కాంతార‌. రిష‌బ్ శెట్టి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజై బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్​గా కాంతార చాప్టర్ 1 చిత్రం రూపొందుతుంది. ఇటివ‌లే షూటింగ్ మొదలుపెట్టిన చిత్రబృందం ఈ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్‌ను అందించింది. కాంత‌ర ఛాప్ట‌ర్ 1 నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది. దీనితో పాటు ఒక టీజ‌ర్ కూడా విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. వెలుగు చూపించనిలేని ఎన్నో రహస్యాలను చీకటి బయటపెడుతోంది. వాటిని చూసి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది ఆసక్తిని రేకెత్తించే డైలాగ్. అడవి నేపథ్యంలో పౌర్ణమి చంద్రుడు .. ప్రళయకాల రుద్రుడిలా కథానాయకుడు కనిపిస్తున్నాడు.

కాంతార’లో కథ ఆరంభంలో ఒక రాజు అడవిలోని గిరిజన ప్రజలకు భూమిని దానంగా ఇస్తాడు. అంతకు ముందు నుంచి ఈ కథ మొదలవుతుంది. రిషబ్ శెట్టి క్లైమాక్స్ సీన్‌తో ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ మొద‌లుకాగా.. కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు అంటూ కండలు తిరిగిన దేహంతో.. బాడి అంతా రక్తపు మరకలు బీభత్సంగా ఉన్న తండ్రి పాత్రలో ఉన్న రిషబ్ శెట్టి క‌నిపించ‌డం టీజ‌ర్‌కి హైలైట్‌గా మారింది. ప్రీక్వెల్ సినిమాలో రిషబ్‌ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళారు, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి అంశాలను హైలెట్ చేసి చూపించబోతున్నట్లు టాక్‌. తొలిపార్టును రూ.16 కోట్లలోపే ముగించిన రిషబ్‌.. ప్రీక్వెల్‌ కోసం ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్‌ను ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Kantara Chapter 1 First Look

కాంతార చాప్టర్-1 చిత్రానికి కూడా హీరో రిషబ్ శెట్టినే కథ, దర్శకత్వం వహిస్తున్నారు. హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రం నిర్మిస్తుండ‌గా, అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM