వినోదం

Siren 108 Movie On OTT : ఈ సినిమా ముందు దృశ్యం కూడా వేస్టే.. ఓటీటీని ఊపేస్తున్న ఈ మూవీని మీరు చూశారా..?

Siren 108 Movie On OTT : వెంక‌టేష్, మీనా క‌ల‌సి న‌టించిన దృశ్యం సినిమా రెండు పార్టులుగా వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఈ రెండు మూవీలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ మూవీ ఒరిజిన‌ల్ మ‌ళ‌యాళం అయిన‌ప్ప‌టికీ తెలుగు ప్రాంతీయ‌త‌కు అనుగుణంగా సినిమాల‌ను రూపొందించారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో సినిమాలు సాగుతాయి. ఇందులో న‌టించిన అంద‌రికీ మంచి పేరు వ‌చ్చింది. అయితే ఇలాంటి సినిమాలు ఈ మ‌ధ్య‌కాలంలో చాలానే వ‌స్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అవి థియేట‌ర్ల‌లో ఆడ‌క‌పోయినా ఓటీటీలో మాత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొంటున్నాయి. ఇక అలాంటి మూవీల్లో జ‌యం ర‌వి న‌టించిన సైర‌న్ 108 కూడా ఒక‌టి. ఇందులో ర‌వితోపాటు కీర్తి సురేష్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీ ఓటీటీలో ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతోంది. ప్రేక్ష‌కులు ఈ మూవీని ఎక్కువ‌గా వీక్షిస్తున్నారు.

క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీలను స‌రైన క‌థ‌తో తీయాలేకానీ పెద్ద హిట్ అవుతాయి. అందుకు గ‌తంలో ఈ జోన‌ర్‌లో వ‌చ్చిన సినిమాలే ఉదాహ‌ర‌ణ‌ల‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ఓ సినిమా క‌థ ఇలాగే ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ సినిమాలో హీరో త‌న శత్రువులంద‌రినీ ఒక ఆట ఆడుకుంటాడు. ఇక సైర‌న్ 108లో కీర్తి సురేష్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఈ మూవీ రివేంజ్ డ్రామాతో న‌డుస్తుంది. ప్ర‌తి స‌న్నివేశం క‌ట్టిప‌డేస్తుంది. ఈ సినిమా ముందు దృశ్యం చాలా త‌క్కువ అన్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

Siren 108 Movie On OTT

ఇక సైర‌న్ 108 సినిమా విష‌యానికి వ‌స్తే త‌న భార్య‌ను హ‌త్య చేసిన ఓ త‌ప్పుడు కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఆంబులెన్స్ డ్రైవ‌ర్ తిల‌క్. (జ‌యం ర‌వి) చుట్టూ సినిమా క‌థ న‌డుస్తుంది. అత‌నికి ప‌దే ప‌దే ప‌రోల్ ఇస్తుంటారు. కానీ అత‌ను తిర‌స్క‌రిస్తుంటాడు. ఇక ఒక రోజు ప‌రోల్‌పై వెళ్లాలని నిర్ణయించుకుని ఇంటికి చేరుకుంటాడు. త‌రువాత త‌న శ‌త్రువులంద‌రూ చ‌నిపోతుంటారు. చివ‌రికి క‌థ రివీల్ అవుతుంది. అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌వుతారు. ఇలా ఈ సినిమా ఆద్యంతం ప్ర‌తి స‌న్నివేశం ఆక‌ట్టుకుంటుంది. ఇందులో ఎక్కడా బోర్ కొట్టే సీన్లు లేవు.

ఇక ఈ మూవీ థియేట‌ర్ల‌లో అల‌రించ‌గా ప్ర‌స్తుతం ఓటీటీలోనూ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీని తెలుగుతోపాటు హిందీ, త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో వీక్షించ‌వ‌చ్చు. ఈ మూవీకి ఐఎండీబీలో 10కి 6.5 రేటింగ్ రావ‌డం విశేషం కాగా ఈ సినిమాను ప్ర‌స్తుతం డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ యాప్‌లో వీక్షించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM