విడాకుల త‌ర్వాత చనిపోతానేమో అనుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన స‌మంత‌..

December 7, 2021 2:17 PM

అక్టోబర్ 2న టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో క్రేజీ జంట‌గా ఉన్న‌ నాగ చైతన్య – సమంత విడిపోతున్న‌ట్టు ప్రకటించారు. అయితే విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు. స‌మంత, నాగ చైత‌న్య‌ విడాకుల ప్రకటన తర్వాత ఓ నెలంతా వీరి విడాకుల అంశంపైనే సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. ఇప్ప‌టికీ ఈ విడాకుల అంశంపై చ‌ర్చ న‌డుస్తూనే ఉంది.

samantha said she thought she might commit suicide at that time

సమంత, నాగ చైతన్య భార్యాభర్తలుగా విడిపోయామని ప్రకటించినప్పటి నుంచి చాలా మంది ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అబార్షన్లు కూడా జరిగాయని ఆరోపణలు చేశారు. స‌మంత ఈ విష‌యాల‌పై కొన్ని సార్లు మౌనంగానే ఉన్నా మ‌రి కొన్ని సార్లు ఇన్‌డైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. తాజాగా సమంత.. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత వారి విడాకులపై తొలిసారి స్పందించింది.

నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్‌. కానీ నేను ఎంత బంలగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉంగలనని అనుకోలేదు.. అని ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ చెప్పుకొచ్చింది.

కాగా, విడాకుల త‌ర్వాత చ‌ట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇక సమంత.. నాగచైతన్య కుటుంబం నుండి రూ.200 కోట్ల భరణం పొందుతుందని సమాచారం అందుతోంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఓ దశలో ఆమె ఆ భరణాన్ని తిరస్కరించిందని కూడా వార్తలు వచ్చాయి. కాగా సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌ తో ఎంతో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now