గురువారం, జూన్ 11, 2026
వినోదం

Samantha : నా తొలి సినిమా ఏమాయ చేశావే గుర్తుకొచ్చింద‌న్న స‌మంత‌..!

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని అంద‌రూ అనుకోగా, ఈమె మాత్రం నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. వరుసపెట్టి ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు గ్రీన్…

Samantha : నా తొలి సినిమా  ఏమాయ చేశావే  గుర్తుకొచ్చింద‌న్న స‌మంత‌..!
Samantha said she remembers how she went audition for em maya chesave movie

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని అంద‌రూ అనుకోగా, ఈమె మాత్రం నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. వరుసపెట్టి ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్.. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాకు పచ్చజెండా ఊపింది. ‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాతగా, ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్‌ చిత్రంలో సమంత నటించనుంది.

Samantha said she remembers how she went audition for em maya chesave movie
Samantha said she remembers how she went audition for em maya chesave movie

అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్ అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో స‌మంత 27 ఏళ్ల బైసెక్సువల్ తమిళ అమ్మాయి‌గా కనిపించనుంది. స‌మంత ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తుంద‌నే అనాలి. అయితే త‌న మొదటి గ్లోబల్ సినిమా గురించి చెబుతూ.. ”సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా.. నేను చివరిగా 2009లో ‘ఏ మాయ చేశావే’ సినిమా కోసం ఆడిషన్ చేశాను. 12 సంవత్సరాల తర్వాత, మళ్లీ ఆడిషన్‌కి వెళ్లినప్పుడు, నేను అదే భయాన్ని ఫీల్ అయ్యాను. నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ సర్” అని ఇన్‌స్టాలో పేర్కొంది.

ఈ సినిమాలో ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ కంటే మించిన వివాస్పద పాత్రలో సమంత నటించబోతోంది. బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోందట. అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర ఇది. మ‌రి ఇందులో ఎంతగా జీవిస్తుందో చూడాలి. కాగా, సమంత తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి