గురువారం, జూన్ 11, 2026
వినోదం

Samantha In Pushpa Movie : పుష్ప నుంచి సమంత ఐటమ్‌ సాంగ్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం..

Samantha In Pushpa Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత తొలి సారి పుష్ప సినిమా కోసం ఐటెం భామ‌గా మారిన విష‌యం తెలిసిందే. గ‌త వారం షూటింగ్ జ‌రుపుకున్న ఈ సాంగ్ లిరిక‌ల్ వీడియోను తాజాగా…

Samantha In Pushpa Movie : పుష్ప నుంచి సమంత ఐటమ్‌ సాంగ్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం..

Samantha In Pushpa Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత తొలి సారి పుష్ప సినిమా కోసం ఐటెం భామ‌గా మారిన విష‌యం తెలిసిందే. గ‌త వారం షూటింగ్ జ‌రుపుకున్న ఈ సాంగ్ లిరిక‌ల్ వీడియోను తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో స‌మంత చాలా హాట్ హాట్‌గా క‌నిపిస్తోంది. బ‌న్నీతో మాంచి జోష్‌తో ఈ సాంగ్‌కి స‌మంత డ్యాన్స్ చేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. చంద్ర‌బోస్ ఈ సాంగ్ రాయ‌గా, చంద్ర‌వతి చౌహాన్ ఆల‌పించారు. ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Samantha In Pushpa Movie item song launched

సమంత ఇప్పటివరకు తన కెరీర్ లో గెస్ట్‌గా చేసిన పాత్రలే చాలా తక్కువ. అందులోనూ ఒకేసారి ఇలాంటి స్పెషల్ సాంగ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే అదే ప్రేక్షకులకు పెద్ద న్యూస్. సమంత చేసిన ‘ఓ అంటావా.. ఓ ఓ అంటావా’ అనే పాట థియేట‌ర్‌లో ర‌చ్చ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. బ‌న్నీతో ఈమె చేసిన డ్యాన్స్‌కి ప్రేక్ష‌కులు పూన‌కాలు వ‌చ్చి ఊగిపోతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన‌ ఈ పాట కోసం స‌మంత‌ ఏకంగా 1 కోటి 30 లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా, అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రంలో ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి