వినోదం

Renu Desai : నా పిల్లలే నాకు పునర్జన్మను ఇచ్చారు.. ఎమోషనల్‌ అయిన రేణు దేశాయ్‌..!

Renu Desai : రేణు దేశాయ్‌.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో తన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లు, తన అభిమానులకు ఆమె దగ్గరగా ఉంటోంది. ఇక సుమారు 20 సంవత్సరాల అనంతరం రేణు దేశాయ్‌ మళ్లీ ఇటీవలే టైగర్‌ నాగేశ్వర్‌ రావు అనే మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఈమె హేమలతా లవణం అనే పాత్రలో నటించి అందరి ప్రశంసలు పొందింది.

అయితే ఈ సినిమా తరువాత ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందని భావించారు. కానీ అలా జరగడం లేదు. తాను తదుపరి ఏ మూవీలో నటించబోతున్నాను అనే విషయంపై రేణు దేశాయ్‌ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే నిత్యం సోషల్‌ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది. ఇక సోషల్‌ మీడియాలో ఆమె తరచూ తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ విషయాలను అన్నింటినీ కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

Renu Desai

రేణు దేశాయ్‌ తన పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో ఎంతో ప్రేమగా ఉంటుంది. వారికి సంబంధించిన విషయాలను ఆమె తన సోషల్‌ ఖాతాల ద్వారా తెలియజేస్తుంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. తన పిల్లల ఫొటోలు, వీడియోలను ఆమె షేర్‌ చేస్తుంటుంది. ఇక తాజాగా వారి గురించి రేణు దేశాయ్‌ ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె కేరళ వెకేషన్‌లో ఉండగా, ఆమె పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

రేణు దేశాయ్‌ పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలు కేరళలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకీరా నందన్‌ పియానో వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అకీరా నందన్‌ హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కూడా. అయితే దీనిపై అటు పవన్‌, ఇటు రేణు ఎవరూ స్పందించలేదు. ఇక తన పిల్లల గురించి రేణు ఇలా రాసుకొచ్చింది. వాళ్లకు నేను జీవితాన్ని ఇచ్చానా, లేదంటే వాళ్లు నాకు పుట్టడం వల్ల నాకు తిరిగి పునర్జన్మ ఇచ్చారా, అన్నది అర్థం కావడం లేదు, నా పిల్లలను చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతుంటాను.. అని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది రేణు దేశాయ్‌. ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక నెటిజన్లు సైతం మీరు నిజంగా చాలా గ్రేట్‌ మేడమ్‌, పిల్లలను బాగా పెంచుతున్నారు.. అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రేణు త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM