వినోదం

Ramajogayya Sastry : స‌ర‌స్వ‌తి పుత్రుడికి కోపం వ‌చ్చింది.. ఏకంగా అకౌంట్ డిలీట్ చేసేశాడుగా..!

Ramajogayya Sastry : ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల‌పై సోష‌ల్ మీడియాలో ఎంత నెగెటివిటీ ప్ర‌చారం జ‌రుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. చేతికి ఎంతొస్తే అంత రాసేసి పెట్టేసి వారిని మాన‌సిక వేధ‌నికి గురి చేస్తున్నారు. బూతులు తిడుతున్నారు. ఇలాంటి ధోర‌ణి మంచి కాద‌ని చెబుతున్నా కూడా ఎవ‌రు కంట్రోల్‌లో ఉండ‌డం లేదు. అయితే ప్రముఖ సినీ గేయ రచయిత ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రిపై సోషల్ మీడియాలో కొంద‌రు పేట్రేగిపోతుండ‌గా, వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రామ‌జోయ్య‌. సోషల్ మీడియాలో కుక్కలు ఎక్కువైపోతున్నాయంటూ ఘాటుగా పేర్కొన్నారు.

మేట‌ర్ లోకి వెళితే మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన గుంటూరు కారం చిత్రంలోని ఓ మై బేబీ పాట మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఈ పాటలోని ట్యూన్‌ను తమన్ కాపీ కొట్టాడంటూ జోరుగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఇక పాటలోని సాహిత్యం మరింత నాసిరకంగా ఉందని, అసలు అందులో సాహిత్యమే లేదని, క్రేవింగ్ క్రేవింగ్ అనే పదాలు తప్పా ఇంకేం లేదని కొంద‌రు నెటిజన్స్ రామ‌జోగయ్య శాస్త్రిని కూడా ట్రోలింగ్ చేశారు. ఆ పాటలో ఎక్కువగా ఇంగ్లీషు మిక్స్ పదాలు దొర్లాయి. అయితే ఈ పాట చెత్తగా ఉందంటూ నెటిజన్లు రామజోగయ్యశాస్త్రిపై పడ్డారు.

Ramajogayya Sastry

దీనిపై రామ‌జోగ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ప్రతివాడూ మాట్లాడే వాడే… రాయి విసిరే వాడే” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా… అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం… తెలసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి” అంటూ రామజోగయ్యశాస్త్రి ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అయితే రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోలింగ్ పట్ల కాస్త హర్ట్ అయినట్టుగా తెలుస్తుండ‌గా, ఇందులో నెగెటివిటీ తట్టుకోలేక ట్విట్టర్ నుంచి వైదొలిగినట్టుగా కనిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయన ట్విట్టర్ ఖాతా కనిపించడం లేదు. తాత్కాలికంగా ట్విట్టర్‌కు దూరంగా ఉంటారా? లేదంటే.. మళ్లీ వస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM