వినోదం

Rakul Preet Singh Wedding : ఈ ఏడాదే ర‌కుల్ పెళ్లి.. డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నారా..!

Rakul Preet Singh Wedding : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్ల పాటు త‌న హ‌వా చూపించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో త‌న స‌త్తా చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ నవంబర్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని గతేడాది అక్టోబర్‌లో మొదటిసారి ప్రచారం జరిగింది. ఆ రూమర్లను రకుల్ కొట్టిపారేయడంతో.. కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ర‌కుల్ ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుందని తెలుస్తోంది. గోవాలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని,ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిధులను పిలుస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే జాకీ భాగ్నాని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టారని సమాచారం. గ‌త మూడేళ్లుగా జాకీ భ‌గ్నానీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్రేమ‌లో ఉన్నారు.టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా చెలామ‌ణీ అయ్యింది ర‌కుల్ ప్రీత్ సింగ్‌… తెలుగులో రకుల్ కి గుర్తింపు వచ్చింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో. ఈ సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబ , రామ్ చరణ్,అల్లు అర్జున్, నాగార్జున,సాయి ధర‌మ్ తేజ్ ఇలా వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది.

Rakul Preet Singh Wedding

ర‌కుల్ తెలుగులో చేసిన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాఫ్ అయ్యాయి.అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడానికి కారణం సీనియర్ హీరోలతో కూడా జతకట్టి హద్దులు మీరిన రొమాన్స్ అని తెలుస్తుంది. కుర్ర హీరోలు ఈ అమ్మ‌డితో సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. దీంతో బాలీవుడ్‌కి ప‌య‌న‌మైంది. ప్ర‌స్తుతం త‌మిళంలో అయ‌లాన్, ఇండియ‌న్ 2 సినిమాలు చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే ర‌కుల్ ప్రియుడు జాకీ భ‌గ్నానీ ఫాల్తు, రంగ్రేజ్‌, యంగీస్థాన్‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. అవి ప‌రాజ‌యాలు చెందిన కార‌ణంగా సినిమా ప్రొడ‌క్ష‌న్‌పై దృష్టిసారిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM