వినోదం

ఓటీటీలోనూ ప్రభాస్ ‘రాజాసాబ్’ ఫెయిల్.. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్!

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రాజాసాబ్’.. సోషల్ మీడియాలో విమర్శలు. Photo Credit: The Raja Saab Movie Team.

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్, మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిధి కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ది రాజా సాబ్ (The Raja Saab) మూవీ జ‌న‌వ‌రి 9వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిల‌వ‌డంతో నెల రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే ఓటీటీలో రిలీజ్ చేశారు. జియో హాట్ స్టార్‌లో ప్ర‌స్తుతం ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. అయితే థియేట‌ర్ల‌లో ఫ్లాప్ అయిన లేదా మంచి పేరు తెచ్చుకుని కూడా ప్రేక్ష‌కులు లేని సినిమాలు చాలా వ‌ర‌కు ఓటీటీలో హిట్ అవుతుంటాయి. దీని వ‌ల్ల మేక‌ర్స్‌కు కాస్తో కూస్తో ప్ర‌యోజ‌నం ఉంటుంది. కానీ రాజా సాబ్ మూవీ ఓటీటీలోనూ డిజాస్ట‌ర్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ మూవీలోని ప‌లు స‌న్నివేశాల‌ను ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ భారీ ఎత్తున ద‌ర్శ‌కుడితోపాటు ప్ర‌భాస్‌ను సైతం ట్రోల్ చేస్తున్నారు.

ఓటీటీలోనూ నిరాశే..

థియేట‌ర్ల‌లో విడుద‌లైన ది రాజా సాబ్ సినిమాను ప్రేక్ష‌కులు భారీ ఎత్తున రిజెక్ట్ చేశారు. విశ్లేష‌కులు సైతం ఈ మూవీని తీవ్రంగా విమ‌ర్శించారు. దీంతో నిర్మాత‌ల‌కు భారీ ఎత్తున న‌ష్టాలు వ‌చ్చాయి. అయితే ఓటీటీలోనూ ఈ మూవీకి నిరాశే ఎదురైంది. ఈ సినిమాలోని ప్ర‌తి సీన్‌ను ప్రేక్ష‌కులు, విశ్లేష‌కులు మ‌రింత శూల శోధ‌న చేస్తూ ప్ర‌భాస్‌ను, ద‌ర్శ‌కుడు మారుతిని భారీ ఎత్తున విమ‌ర్శిస్తున్నారు. అస‌లు ఈ సినిమా చేయాల‌ని మీకు ఎలా అనిపించింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు మారుతిని అయితే నెటిజ‌న్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆయ‌న‌కు సినిమాను ఎలా తీయాలో తెలియ‌ద‌ని విమ‌ర్శిస్తున్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి ఫెయిల్‌..

ది రాజా సాబ్ సినిమాలో ప‌లు స‌న్నివేశాల‌ను ప్రేక్ష‌కులు స్క్రీన్ షాట్లు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏయే స‌న్నివేశాల్లో త‌ప్పులు జ‌రిగాయో వివ‌రిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని స‌న్నివేశాల్లో కంటిన్యుటీ త‌ప్పులు అనేకం చోటు చేసుకున్నాయ‌ని చెబుతున్నారు. సాధార‌ణంగా ద‌ర్శ‌కుడు మారుతికి త‌క్కువ బ‌డ్జెట్‌లోనే యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైనర్ల‌ను తీస్తాడ‌ని, ఆయ‌న సినిమాల్లో కామెడీ ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు కితాబిస్తుంటారు. అయితే అలాంటి సాధార‌ణ ద‌ర్శ‌కుడికి ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ వ‌స్తే దాన్ని మారుతి స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడ‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ప్రేక్ష‌కులు కేవ‌లం మారుతినే కాదు, ప్ర‌భాస్‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాలో ఆయ‌న యాక్టింగ్ చాలా కృత‌కంగా ఉంద‌ని అంటున్నారు. ప‌లు స‌న్నివేశాల్లో ఆయ‌న అస‌లు అంటీ ముట్ట‌న‌ట్లు యాక్టింగ్ చేశాడ‌ని అంటున్నారు.

గ్రాఫిక్స్‌, డూప్స్ పై అస‌హ‌నం..

ది రాజాసాబ్ సినిమాలో ప్ర‌భాస్‌కు చాలా స‌న్నివేశాల్లో డూప్‌ల‌ను ఉప‌యోగించారు. అయితే కొన్ని సీన్ల‌లో ఏకంగా ఆయ‌న ముఖాన్ని ఫేస్ స్వాపింగ్ చేశారు. ఈ క్ర‌మంలో గ్రాఫిక్స్ ను ఉప‌యోగించారు. కానీ ఆ గ్రాఫిక్స్ స‌రిగ్గా రాలేదు. దీంతో ఆయా స‌న్నివేశాల్లో ప్ర‌భాస్ ను అస‌లు చూడాల‌నిపించ‌లేదు..అని ఫ్యాన్స్ విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఓటీటీలో ఈ విష‌యాలు ఇంకా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌భాస్ ముఖాన్ని ఫేస్ స్వాపింగ్ చేసే బ‌దులు నేరుగా ఆయ‌న‌నే న‌టింప‌జేసి ఉంటే బాగుండేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఆయ‌న ఫేస్ స్వాపింగ్ కోసం వాడిన గ్రాఫిక్స్‌ను సినిమాకు వాడి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. ఇలా ప్ర‌భాస్ రాజాసాబ్ మూవీ థియేట‌ర్ల క‌న్నా ఓటీటీలోనే ప్ర‌స్తుతం తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటుంద‌ని నెటిజ‌న్ల కామెంట్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన నేప‌థ్యంలో ప్ర‌భాస్ త‌దుపరి సినిమా ఫౌజీపైనే ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి ఆ సినిమాతో ప్ర‌భాస్ అభిమానుల ఆశ‌ల‌ను నిజం చేస్తారా, లేదా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM