NTR : ఈ మధ్యకాలంలో వేణుస్వామి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. గతంలో ఈయన సమంత, నాగచైతన్య గురించి చెప్పిన మాటలు నిజం అవడంతో ప్రస్తుతం ఇతను సినీ హీరోల జాతకం గురించి బయట పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2024 కి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉండదని, ఆయన రాజకీయాల్లో ఉండరని వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న తారక్ కేవలం తన దృష్టిని సినిమాలపై మాత్రమే పెట్టారు. కానీ ఈయన రాజకీయాలలోకి రావాలని ఎంతోమంది అభిమానులు భావిస్తున్నారు. రాజకీయాలపై శ్రద్ధ చూపని ఎన్టీఆర్ గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్టీఆర్ జాతకం చూస్తే ఆయన జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం పుష్కలంగా ఉందని వేణు స్వామి తెలిపారు.
ఎన్టీఆర్ నక్షత్రం, జయలలిత నక్షత్రం ఒకటేనని.. ఈ నక్షత్రం ఉన్నవారు రాజకీయాలలో మంచి పేరు సంపాదించుకుంటారని ఈ సందర్భంగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తన దృష్టి మొత్తం సినిమాలపై ఉంచారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన RRR చిత్రం జనవరి 7న విడుదలకు సిద్ధమవుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…