వినోదం

Manchu Manoj in OTT : ఫ్యాన్స్​కు మనోజ్ రిటర్న్​ గిఫ్ట్ .. రాంప్ ఆడిద్దామంటున్న మంచు హీరో

Manchu Manoj in OTT : మంచు మోహ‌న్ బాబు ముద్దుల త‌న‌యుడు మ‌నోజ్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఎన్నో సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కులని అల‌రించాడు. ఒక‌ప్పుడు త‌న సినిమాల‌తో ఎంత‌గానో అల‌రించిన మంచు మనోజ్ కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యాడు. అయితే ఇప్పుడు తిరిగి త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. సినిమాలు చేస్తూనే, ఓటీటీ ద్వారా అల‌రించ‌డానికి రెడీ అయ్యాడు. గ‌తంలో బుల్లితెర‌పై బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా నాని, జూనియర్ ఎన్టీఆర్‌లు హోస్ట్‌లుగా అదరగొట్టారు. నాగార్జున అలరిస్తూనే ఉన్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడుతో చిరంజీవి, అన్ స్టాపబుల్ సిరీస్‌తో బాలయ్య సంద‌డి చేస్తుండ‌డం మ‌నం చూశాం.

ఇక టాలీవుడ్ యువ హీరోలు రానా, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలు పలు షోలను హోస్ట్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ జాబితాలోకి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేరాడు.ఈటీవీ విన్ యాప్ లో మనోజ్ హోస్ట్ చేయ‌నున్న‌ థ్రిల్లింగ్ గేమ్ షో “ఉస్తాద్”. ఈ షో ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆసక్తి రేపిన తాను ఎప్పటి నుంచి ఓటిటి వీక్షకులని పలకరిస్తాడు అనేది కన్ఫర్మ్ అయ్యిపోయింది. డిసెంబర్ 15 నుంచి ఈ షోని స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించడం విశేషం.ఈ షో గెలిచిన ప్లేయర్స్‌కు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు వెండితెరపై అలరించిన ఈ రాకింగ్ స్టార్.. ఇక ఓటీటీ, టీవీ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు.

Manchu Manoj in OTT

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ.. మనోజ్ కావాలనే బ్రేక్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతుంటే మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో ‘నేను మీ మనోజ్.. నా కథ మీరు రాసుకున్నది, నా రాక మీరు పిలుస్తున్నది‘ అంటూ తన ఫ్యాన్స్ కోసం ఓ రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఈ షో ద్వారా తిరిగి రాబోతున్నారని చెప్పుకు వ‌చ్చారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. అహం బ్రహ్మస్మి, వాట్ ది ఫిష్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయో తెలియాల్సి ఉంది. మొత్తానికి మ‌నోజ్ రానున్న రోజుల‌లో త‌న అభిమానుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM