Jigarthanda Double X OTT Release Date : ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ హిట్ చిత్రమైన సరే థియేటర్‌లో వచ్చిన నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇటీవల కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్, ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. విడుదలై నెలరోజులు అవ్వకుండానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండడం గమనార్హం. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘జిగర్తాండ డబల్ ఎక్స్ చిత్రం 2014లో వచ్చిన ‘జిగర్తాండ’ అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్, బాబీసింహ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఈ సినిమాకి సీక్వెల్‌గా జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే చిత్రం చేశారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే శుక్రవారం (డిసెంబర్ 8) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో తీసుకురానున్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, నిమేషా సజయన్, సత్యన్, అర్వింద్ ఆకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ కలెక్షన్లు నిరాశపరిచినప్పటికీ తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.
చివరి నలభై నిమిషాలు అద్భుతంగా ఉందంటూ ధనుష్ చేసిన ట్వీట్ సినిమాపై కొంత ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం, ఎస్.కథిరేసన్, అలంకార్ పాండియన్ నిర్మాతలుగా వ్యవహారించారు. తిరు సినిమాటోగ్రఫీ, షఫీక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ ఆకట్టుకుంది. సినిమాలో లారెన్స్, SJ సూర్య తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆడియన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…