Guppedantha Manasu December 18th Episode : బుల్లెట్ పక్కకి తగలడంతో శైలేంద్ర ప్రాణాలతో బతికి పోతాడు. బలవంతంగా మహేంద్ర ని శైలేంద్ర దగ్గర నుండి తీసుకువెళ్తారు వసుధారా, అనుపమ. ఇంటికి తిరిగి వచ్చి, నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి అని అనుపమ పై ఫైర్ అవుతాడు మహేంద్ర. శైలేంద్ర ప్రాణం పోయడానికి వచ్చావా, వాడి ఆయుష్షు పెంచడానికి వచ్చావా అని అనుపమని కోపంలో మహేంద్ర అంటాడు. నీ ఫ్రస్టేషన్ పెరిగిపోయింది. కాబట్టి, మధ్యలో వచ్చానని మహేంద్ర కి అనుపమ చెపుతుంది. వాటర్ తాగమని, బాటిల్ ఇస్తుంది.
ఆమె ఇచ్చిన బాటిల్ ని విసిరి కొడతాడు. మహేంద్ర నువ్వు చేసిన పనికి ఫుల్ బాటిల్ తాగితే కానీ మామూలు మనిషిని కాలేనని అంటాడు. అనుపమ రావడం వల్లే శైలేంద్ర బతికి పోయాడని, లేకపోతే వాడి శవాన్ని పాడి మీద పడుకోపెట్టేవాడిని కోపంగా ఉంటాడు. అదే జరిగితే, నువ్వు జైల్లో ఊచలు లెక్క పెట్టే వాడివని అనుపమంటుంది. అలాంటి వాడి కోసం, జైలుకు వెళ్లిన పర్వాలేదని అంటాడు. అనుపమని తానే రమ్మన్నానని, మహేంద్ర కి వసుధార చెప్తుంది. శైలేంద్రని చంపడానికి సిద్ధమైన మీరు, నేను చెప్తే వినరని కంట్రోల్ కాలేరని అనుపమని ఫోన్ చేసి తానే పిలిచినట్లు చెబుతుంది.
అప్పటివరకు ఆవేశంలో ఉన్న మహేంద్ర వసుధార చెప్పడంతో సైలెంట్ అయిపోతాడు. శైలేంద్రని చంపితే, ఒక బుల్లెట్ తో చనిపోతాడు, నువ్వు జైల్లో కూర్చుంటావు. వసుధారా నీకోసం జైలుకు రావాలా? రిషి కోసం వెతకాలా? అని నిలదీస్తుంది అనుపమ. శైలేంద్ర చనిపోతే రిషి దొరుకుతాడా? కనీసం రిషి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పోతాడని అంటుంది అనుపమ. అనుపమ మాటల్ని వసుధార సమర్దిస్తుంది. తొందరపడి రాంగ్ స్టెప్ వేస్తే, రిషి గురించి ఎప్పటికీ తెలిసే అవకాశం ఉండదని అంటుంది.
కావాలని నిజం చెప్పలేదు శైలేంద్ర అని మహేంద్ర అంటాడు. నిజంగా వాడికి రిషి గురించి తెలిస్తే, వాడు రిషి ని కిడ్నాప్ చేసినట్లు చెప్తాడు. శైలేంద్ర అబద్ధం ఆడే ఉంటాడని అనుపమ అనుకుంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది శైలేంద్ర మీద పగ తీర్చుకోవడం కాదు. రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడం అని వసుధార ఎమోషనల్ అయిపోతుంది. రిషి ఎక్కడున్నా బాగుంటాడని ఓదారుస్తుంది అనుపమ. వసుధార బాధని అర్థం చేసుకోండి. సైలెంట్ గా ఉండమని, నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే వెళ్లి శైలేంద్ర దేవయాని ని కాల్చేయమని మహేందర్ కి గన్ ఇస్తుంది అనుపమ.
వాళ్ళని కాదు నిన్ను కాల్చాలి అని ఫైర్ అవుతాడు మహేంద్ర. రిషి ఆచూకీ కోసం ముకుల్ కి ఫోన్ చేయాలని వసుధారా అనుకునే లోగా, రిషి కార్ ఇంటి ముందు ఆగుతుంది. రిషి ఆనందంగా ఉంటుంది. రిషి తిరిగి వచ్చాడని ఎమోషనల్ అవుతుంది. ఆనందంగా బయటికి వస్తుంది. కానీ, రిషి కాకుండా కారులో నుండి ముకుల్ దిగుతాడు. రిషి కారు దొరికింది. కానీ ఇప్పటివరకు అతని ఆచూకీ మాత్రం దొరకలేదని వసుధారతో అంటాడు. శైలేంద్ర తనని బెదిరించిన విషయం ముకుల్ కి చెప్తుంది వసుధార.
ఎండి సీట్ మీద ఆశ ఉందనే విషయం తేలిపోయిందని ముకుల్ అంటాడు. ఈ ఆధారాలతో అరెస్ట్ చేసినా, తర్వాత తను బెదిరించలేదని మాట మార్చి జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉందని ముకుల్ అంటాడు. ఇకనుండి శైలేంద్ర మీద అబ్జర్వేషన్ పెడతానని, త్వరలోనే రిషి క్షేమంగా తిరిగి వస్తాడని మాట ఇచ్చి వెళ్తాడు. ముకుల్ కారుతో రిషి కి తనకి ఉన్న జ్ఞాపకాలని గుర్తుచేసుకొని వసుధార ఎమోషనల్ అయిపోతుంది. కారు ఎక్కు అని రిషి చెప్తున్నట్లు కలకంటుంది.
మీరు లేకుండా బతకలేకపోతున్నానని, మనసులో ఉన్న బాధని బయటకు చెప్తుంది. రిషి ఎక్కడున్నా తెలియజేసి మమ్మల్ని ఒకటి చేయమని, కారులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని వసుధార వేడుకుంటుంది. వసుధార కాలేజ్ ఎంటీ క్యాబిన్లో కూర్చుని రుషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బోర్డు మీటింగ్ పెట్టమని, అందరూ అంటున్నట్లు ఫణింద్ర, మహేంద్ర చెప్తారు. రిషి లేకుండా ఎలా అని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్తారు.
మిషన్ ఎడ్యుకేషన్ టూర్ పై రిషి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాడని, అబద్ధం చెప్పాలని వసుధారా అంటుంది. మహేంద్ర మాత్రం అందుకు ఒప్పుకోడు. ఫణింద్ర కన్విన్స్ చేయడంతో ఇష్టం లేకపోయినా అబద్ధం ఆడటానికి ఒప్పుకుంటాడు మహేంద్ర. మరో దారి లేక నోటీస్ టైప్ చేసి బోర్డులో పెడుతుంది. మీరు వస్తారని ఆశతో ఎన్ని రోజులైనా ఎదురు చూస్తారని అనుకుంటుంది వసుధార.
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…