Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. తెలుగు నాట వీరిద్దరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి సినిమాలకున్న పోటీ మరే హీరోకు ఉండదనేది అందరికి తెలిసిన వాస్తవం. గత కొన్ని శతాబ్ధాలుగా ఈ ఇద్దరు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. అభిమానుల విషయంలో ఇద్దరిలో ఎవ్వరినీ తక్కువ చేయడానికి లేదు. వీరి సినిమా ఒక సీజన్‌లో విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. అందులోనూ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే పండగ సీజన్‌లో వీరిద్దరు బాక్సాఫీస్ బరిలో 11 సార్లు తలపడ్డారు.
1985 నుంచి ఇప్పటి వరకు బరిలో పోటీ పడిన వీరు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ రెండు చిత్రాలకు మంచి ఆదరణ దక్కడం విశేషం. అయితే కెరీర్ పరంగా ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ మంచి స్నేహం ఉంటుంది. చిరంజీవి పలు సార్లు బాలయ్యకి అండగా నిలిచారు. బాలయ్య హీరోగా నటించిన గౌతమీపుత్రశాతకర్ణి సినిమా ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. బాలయ్య చిరుకు ఫోన్ చేసి స్వయంగా ఆయనను ఆహ్వానించడంతో ఇద్దరూ కలిసి ఆ ఫంక్షన్ లో సందడి చేశారు.
చిరంజీవి బాలయ్య ఒకే వేదికపైకి రావడంతో మూవీకి చాలా మైలేజ్ వచ్చింది. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కంటే ముందు బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సినిమాకు కూడా చిరు సపోర్ట్ చేశారన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా మరేదో కాదు ఆదిత్య 369 .ఈ మూవీకి సైతం చిరంజీవి ప్రమోషన్స్ చేశారు. సినిమా విడుదల తరవాత ప్రేక్షకులను ఆకట్టుకునేలా నిర్మాత ఓ యాడ్ ను తీయాలనుకోగా, ఆ యాడ్ కోసం చిరును సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పారు. ఆ యాడ్ దూరదర్శన్ లో ప్రసారం కాగా దాని ప్రభావం తో కూడా సినిమాకు మైలేజ్ పెరిగింది. ఆ విధంగా చిరంజీవి సినిమాకి బాలయ్య ప్రమోషన్ చేశారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…