Bhanu Sri : వ్య‌క్తిగ‌త జీవితంపై రూమ‌ర్లు.. అస‌లు విష‌యం చెప్పిన భానుశ్రీ‌..!

December 20, 2021 4:45 PM

Bhanu Sri : తెలుగు బుల్లితెర‌, వెండితెర ప్రేక్ష‌కుల‌కు భానుశ్రీ అంటే తెలుసు. ఈమె గురించి ఎవ‌రికీ ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. అప్ప‌ట్లో బిగ్ బాస్ సీజ‌న్ 2లో ఈమె అల‌రించింది. త‌రువాత ఈమెకు ప‌లు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో, సిరీస్‌ల‌లో క‌నిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు ఈమె త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ హీటిక్కెస్తుంటుంది.

Bhanu Sri told truths about her personal life

బిగ్‌బాస్ ద్వారా భానుశ్రీ ఫేట్ మారిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. అటు బుల్లితెర‌తోపాటు ఇటు వెండితెర‌పై కూడా ఈమెకు అవ‌కాశాలు చాలానే వ‌చ్చాయి. దీంతోపాటు ఈమె అభిమానుల‌ను కూడా బాగానే సంపాదించుకుంది. ఏడు చేప‌ల క‌థ అనే ఓ మూవీ ద్వారా ఈమె యువ‌త‌లో సెగ‌లు రేపింది. త‌రువాత జ‌బ‌ర్ద‌స్త్‌లోనూ అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తూ వ‌స్తోంది. ఇక ఈవెంట్స్‌లోనూ ఈ భామ పాల్గొంటూ బాగానే సంపాదిస్తోంది.

డ్యాన్స్ ప‌రంగా కూడా భానుశ్రీ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అయితే ప్ర‌స్తుతం మాత్రం ఈమెకు అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేద‌నే చెప్పాలి. కావ‌ల్సినంత‌గా గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తున్నా ఆఫ‌ర్లు మాత్రం ల‌భించ‌డం లేదు. ఇక తాజాగా ఈమె వ్య‌క్తిగ‌త జీవితానికి చెందిన కొన్ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా.. వాటిపై స్పందించింది.

తాను సినిమాల్లో న‌టించ‌డం త‌న త‌ల్లిదండ్రుల‌కు అస్స‌లు ఇష్టం లేద‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఆమె వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. కెరీర్ తొలినాళ్ల‌లో డ‌బ్బులు లేక ఎన్నో ఇబ్బందులు ప‌డింది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు త‌న బాయ్ ఫ్రెండ్ స‌హాయం చేశాడు. సిటీకి వ‌చ్చిన కొత్త‌లో ఆమె ఉండ‌డానికి రూమ్ లేక‌పోవ‌డంతో ఓ జ్యూస్ సెంట‌ర్‌లో రాత్రి నిద్రించేద‌ట‌.

ఇక సినిమాల్లో భానుశ్రీ ఎంతో ట్రై చేసినా ఆమెకు ఆఫ‌ర్స్ రాలేద‌ట‌. దీంతో త‌న‌కు బాయ్ ఫ్రెండ్ అండ‌గా ఉన్నాడ‌ట‌. అమ్మానాన్న‌ల క‌న్నా ఎక్కువ‌గా అత‌ను త‌న‌కు తోడున్నాడ‌ట‌. దీంతో అత‌నే త‌న‌కు ఎక్కువ‌.. అంటూ భానుశ్రీ చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment