వినోదం

Apurva Review : అపూర్వ రివ్యూ.. అనుక్షణం ఆసక్తిని రేకెత్తించే మూవీ

Apurva Review : సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలకి ఇటీవ‌ల ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎక్కువ‌గా ల‌భిస్తుండ‌డం మనం చూస్తున్నాం. ఇటీవ‌ల బాలీవుడ్ హాట్ బ్యూటి తారా సుతారియా, రానా నాయుడు వెబ్ సిరీస్ ఫేమ్ అభిషేక్ బెనర్జీ, రాజ్‌పాల్ యాదవ్, ధైర్య కర్వా ప్రధాన పాత్రల్లో అపూర్వ అనే చిత్రం తెర‌కెక్క‌గా, ఈ చిత్రానికి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఒక సాధారణమైన యువతి తనకి ఎదురైన అనూహ్యమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంది? అసాధారణమైన పరిణామాలను ఎలా తట్టుకుని నిలబడగలిగింది? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్ర సాగింది.

అపూర్వ చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే ఉత్తరప్రదేశ్‌లో గ్వాలియర్‌కు చెందిన అపూర్వ (తారా సుతారియా) తల్లిదండ్రులు చూసిన అబ్బాయి సిద్ధార్థ్ (ధైర్య కర్వా)తో నిశ్చితార్థం జ‌రుపుకుంటుంది. అయితే త‌న‌ బర్త్ డేకు సర్‌ప్రైజ్ చేద్దామని ఆగ్రాకు బస్సులో వెళ్తుండ‌గా, ఆ బ‌స్సుపై దాడి జ‌రుగుతుంది. సుఫారి తీసుకొని మ‌నుషుల‌ని చంపే సుఖ్కా (అభిషేక్ బెనర్జీ), జుగ్ను (రాజ్‌పాల్ యాదవ్) గ్యాంగ్ ఆ బస్సుపై దాడి చేస్తారు. డ్రైవర్‌ని చంపి ప్రయాణికుల నుంచి రాబరీ చేస్తారు. ఆ స‌మ‌యంలో అపూర్వ‌ని కూడా కిడ్నాప్ చేస్తారు. అస‌లు అపూర్వ‌ని కిడ్నాప్ చేయ‌డానికి కార‌ణం ఏంటి, అపూర్వను రక్షించేందుకు కాబోయే భర్త సిద్ధార్థ్ ఏం చేశాడు? క్రిమినల్స్ చెర నుంచి అపూర్వ బయటపడిందా లేదా అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది.

Apurva Review

ఇండియాలోని అత్యంత ప్రమాదకరమైన లొకేషన్స్ లో ఈ సిరీస్ ను చిత్రీకరించినట్టుగా మేకర్స్ చెప్పుకొచ్చారు.ఇదంతా బాగానే ఉన్నా చిత్రంలో మైన‌స్ ఏంటంటే. ఒక్క పాట‌లో అపూర్వ ఆగ్రా వెళ్ల‌డానికి కార‌ణం చూపించారు, అలానే క్రిమిన‌ల్స్ నుంచి తప్పించుకునేందుకు అపూర్వ ప్రయత్నాలు, క్రిమినల్స్‌ని చంపే విధానం గ్రిప్పింగ్‌గా చూపించ‌డం కాస్త మైన‌స్ అని చెప్పాలి. ఎప్పుడు గ్లామర్ పాత్రలు చేసే తారా సుతారియా ఛాలేంజింగ్ రోల్ తీసుకొని ఒదిగిపోయింది. ఇందులో ఒకే ఒక్క చిన్న ట్విస్ట్ త‌ప్ప పెద్ద‌గా ఆశించే అంశాలు ఏమి లేన‌ట్టుగా ఉన్నాయి. వీకెండ్‌కి ఈ మూవీ బెస్ట్ మూవీ అని చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM