వినోదం

Silk Smitha : సిల్క్ స్మిత‌పై మ‌రో బ‌యోపిక్.. ప్ర‌ధాన పాత్ర ఎవ‌రు పోషించ‌నున్నారంటే..!

Silk Smitha : భారతీయ సినిమా ప‌రిశ్ర‌మ‌లోని గొప్ప నర్తకీమణుల్లో సిల్క్ స్మిత ఒకరు అనే విష‌యం తెలిసిందే. అప్పట్లో తెలుగు, తమిళ సినిమాల్లో లెక్కలేనన్ని సినిమాలు చేసిన తెలుగ‌మ్మాయి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఈమె ఓ తరం కుర్రకారుని ఉర్రూతలూగించింది. కైపెక్కించే మాటలు, మత్తెక్కించే చూపులతో ఓ వర్గం ప్రేక్షకులకు ఆరాధ్య దేవత అయిపోయారు సిల్క్. కెరీర్‌‌లో ఎంతో ఎత్తుకు వెళ్లి.. పేరు ప్రఖ్యాతలు సంపాదించి.. చివరికి బలవన్మరణానికి పాల్పడిన స్మిత ఈ లోకాన్ని వీడి 27 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆమెను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

1980లో డాన్సర్ గా ఆమె ఓ తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ తన అందచందాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడా హీరోలతో కలిసి వెండితెరపై మెరిసి సంచలనాలు సృష్టించింది. ఈరోజు సిల్క్ స్మిత జయంతి కావడం విశేషం. 1960 డిసెంబర్ 2న ఆమె జన్మించారు. నేడు ఆమె 63వ జ‌యంతి. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఈవిడ జీవితంపై బాలీవుడ్‌లో డ‌ర్టీ పిక్చ‌ర్ అనే చిత్రం రూపొంద‌గా, ఈ సినిమా ఎంత ప్ర‌జాద‌ర‌ణ పొందిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఈ రోజు ఆమె జ‌యంతి సంద‌ర్భంగా ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాను ప్రకటించారు. అంతేకాదు, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

Silk Smitha

ఈ బయోపిక్‌లో సిల్క్ స్మిత పాత్రను చంద్రికా రవి పోషిస్తుంబ‌డ‌గా, ఆమె భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్, నటి . ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన చంద్రికా రవి.. ఈ ఏడాది బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో కనిపించారు. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ పాటలో బాలయ్యతో ఆడిపాడారు.ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చంద్రికా రవి చాలా బాగున్నారు. సిల్క్ స్మితకు ఆమెకు పోలిక లేకపోయినా.. స్మితను రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఒ ఈ సినిమాకు జయరాం దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌బీ విజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM