Adhurs Re-release Date : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ సినిమాని ఇప్పటికీ చాలామంది మర్చిపోయి ఉండరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 2010లో ఈ సినిమా రిలీజ్ అయ్యి, మంచి విజయాన్ని అందుకుంది. పైగా, ఈ సినిమా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది, ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా చాలామంది మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. పైగా అదుర్స్ సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ కూడా కొట్టదు. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేశారు.
ముఖ్యంగా చారి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. బ్రహ్మానందం కామెడీ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే, ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అదుర్స్ సినిమా థియేటర్ల లోకి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని, అంతా ఎదురు చూస్తున్నారు. అయితే, ఎట్టకేలకి అదుర్స్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 18న అదుర్స్ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ ఏడాది మార్చి 4న అదుర్స్ కి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అది అప్పట్లో వాయిదా పడింది. దీంతో, ఫోర్ కే ఫార్మాట్లో నవంబర్ 18 వ తేదీన అదుర్స్ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో రమా ప్రభ, శయాజి షిండే, నాజర్, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు వహించారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, వల్లభనేని వంశీ సినిమాని నిర్మించారు. కోన వెంకట్ సినిమాకి కథని అందించారు. నయనతార, షీలా హీరోయిన్లుగా కనబడి ఆకట్టుకున్నారు. ఈ మూవీ లో బ్రహ్మానందం కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, పంచ్‍లు మూవీ కి బాగా ప్లస్ అయ్యాయి. కామెడీ కూడా వర్క్ అవుట్ అయింది. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…