Saptapadi : హిందూ వివాహాల్లో అనేక ఆచారాలు పాటిస్తారు. ఈ ఆచారాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఉంటాయి. అయితే 7 ప్రమాణాలు, కన్యాదానం వంటివి మాత్రం హిందూ వివాహాల్లో దాదాపుగా ఉంటుంది. హిందూ వివాహాల్లో ఇవి ఖచ్చితంగా పరిగణించబడతాయి. ఇవి లేకుండా జరిగే వివాహం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. తాజాగా అలహాబాద్ కోర్టు కూడా సప్తపది హిందూ వివాహానికి చాలా ముఖ్యమైనది అని అభివర్ణించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహానికి సప్తపది తప్పనిసరి అని, అప్పుడే వివాహం పూర్తవుతుందని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్నది. అయితే వివాహానికి కన్యాదానం తప్పనిసరి అని ఆ కోర్టు పరిగణించలేదు. తాజాగా ఒక క్రిమినల్ కేసు విచారణలో భాగంగా, పిటిషినర్ తన వివాహంలో కన్యాదానం చేయలేదని, దీనిని ధృవీకరించడానికి సాక్షులను మళ్లీ విచారించాలని కోర్టును అభ్యర్థించారు. అప్పుడు కోర్టు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ను ప్రస్తావించింది.
హిందూ వివాహాలకు సప్తపది తప్పనిసరి అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కన్యాదానం జరిగిందా లేదా అన్నది ముఖ్యం కాదు కనుక సాక్షులను మళ్లీ పిలవాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. అసలు హిందూ వివాహాలకు సప్తపది ఎందుకు ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ వివాహంలో సప్తపది ఆచారాలు ఖచ్చితంగా నిర్వహించబడతాయి. వివాహం జరిగేటప్పుడు వధూవరులు ఏడు వాగ్దానాలను చేసుకుంటారు. సప్తపదిలో మొదటి అడుగు ఆహారం కోసం, రెండవది బలం కోసం, మూడవది సంపద కోసం, నాలుగవది సంతోషం కోసం, ఐదవది కుటుంబం కోసం, ఆరవది ఋతుక్రమం కోసం, ఏడవది స్నేహం కోసం. వివాహం తరువాత భార్యాభర్తలు జీవిత ప్రయాణంలో కలిసి ముందుకు సాగాలని మరియు జీవితంలో ప్రతి రంగంలో కలిగి పనిచేయాలని ఇది చెబుతుంది.
అలాగే ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకోవాలని ఇది చెబుతుంది. తద్వారా వారి వైవాహిక జీవితం సంతోషంగా మరియు సపన్నంగా ఉంటుంది. ఈ సమయంలో వధూవరులు అనేక మంత్రాలను కూడా పఠిస్తారు. దీంతో వారికి దేవున్ని ఆశీస్సులు కూడా లభించి వారు కొత్త జీవితాన్ని హాయిగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…