Srisailam Istakameswari Temple : శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం ఉంది. అయితే ఆ ప్రదేశంలో మహిమగల అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక అది నెరవేరుతుంది. పైగా ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి యొక్క నుదురు లాగా మెత్తగా ఉంటుందట. తిరుమల తర్వాత ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో మల్లన్న కొలువై ఉన్నారు. ఇక్కడ పర్వతాలపై మల్లన్నని ఒకప్పుడు చుట్టుపక్కల వుండే గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకోవడం జరిగేది.
కానీ ఇప్పుడు వివిధ దేశాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సిద్ధ క్షేత్రం ఇది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ అరణ్యంలో ఉంటాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇక్కడ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ పూజలు జరుగుతూ ఉండేవి. అయితే అత్యంత విశిష్టమైనదిగా ఇష్టకామేశ్వరి ఆలయం ఇక్కడ దర్శనమిస్తుంది. ఇదివరకు సిద్ధుల పూజలు అందుకున్న ఇష్ట కామేశ్వరి దేవి ఇప్పుడు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తోంది.
శ్రీశైలం నుండి డోర్నాల వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది. దట్టమైన అడవిలో వెళుతూ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళగానే శక్తివంతమైన ప్రదేశంలో ఉన్నట్లు మనకి అనిపిస్తుంది. ఇక్కడ ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలని కలిగి ఉంటారు. రెండు చేతుల్లో తామర పూలు, మిగతా రెండు చేతుల్లో జపమాల ఉంటాయి. ఈ అమ్మవారు శివలింగం ధరించి కనపడతారు. అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు.
నుదురు మెత్తగా ఉంటుందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. ప్రయాణం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. దట్టమైన అడవుల లోపల నుండి వెళ్లాల్సి ఉంటుంది. అటవీ మార్గంలో ఒక కిలో మీటర్ నడక తర్వాత, చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం ఉంటుంది. డోర్నాల మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడ అమ్మవారికి బొట్టు పెడితే మనిషి నుదురు ఎలా మెత్తగా ఉంటుందో అలా ఉంటుందట. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్లి, మనం ఏ కోరికైనా కోరుకుంటే అది కచ్చితంగా నెరవేరుతుందట.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…