Sarayu River In Ayodhya : జనవరి 22వ తేదీన అయోధ్యలో జరగబోయే శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ట ఉత్సవం కోసం యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే.. ఈ వేడుకకు ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంది. ఆ తరువాత రోజు నుంచి ఎవ్వరైనా ఈ మందిరాన్ని దర్శించవచ్చు. ఇక అయోధ్యకు వెళ్ళినప్పుడు తప్పకుండా చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే.. అయోధ్యలోని సరయు నదిలో మునకలు వేయడం. అవును, అక్కడికి వెళ్తే తప్పక నదిలో స్నానం చేయాలి.
అయోధ్య కథకు సరయు నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీరాముడు అడవికి వెళ్లి వనవాసం చేసి తిరిగి అయోధ్యకు వచ్చిన తరువాత ఆయన జీవితాన్ని చూసినది సరయు నదే. వేదాలలో కూడా సరయు నది ప్రస్తావన వస్తుంది. పద్మ పురాణంలో ఈ నది గొప్పదనం గురించి చెప్పబడింది. మహాభారతంలోని భీష్మ పర్వంలో కూడా ఈ నది గొప్పదనం గురించి వస్తుంది. అయోధ్యకు ప్రాథమిక గుర్తింపుగా తులసి దాస్ సరయు నదిని వర్ణిస్తాడు. ఋగ్వేదం లో చెప్పినట్లు సరయు నది ఒక వేదం నది. శ్రీమహా విష్ణువు కన్నీటి బొట్టు నుంచి సరయు నది ఆవిర్భవించింది అని పురాణాలు చెబుతున్నాయి.
శాంకసరుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో పడేస్తాడు. విష్ణువు మత్స్య అవతారం ధరించి ఆ రాక్షసుడిని చంపి, వేదాలను తీసి బ్రహ్మకి అప్పగిస్తాడు. విష్ణువు కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లను మానస సరోవరంలో ఉంచాలని బ్రహ్మ దేవుడు చెయ్యి పట్టి తీసుకుంటాడు. ఆ కన్నీళ్ల తోనే సరయు నది ఏర్పడిందని వేదాలు చెబుతున్నాయి. హిమాలయాల పాదాల నుంచి ఉద్భవించిన సరయు నది శారదా నదికి ఉపనదిగా మారుతుంది. సరయు నది భూమిపై శ్రీ రాముని బాల్య లీలలను చూడడానికే ఉద్భవించింది అని చెబుతుంటారు. కనుక అయోధ్యకు వెళ్తే సరయు నదిలో స్నానం చేయడం మరిచిపోకండి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…