ఆధ్యాత్మికం

Kushmanda Devi : ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి రోగాలు అయినా స‌రే న‌య‌మ‌వుతాయి..!

Kushmanda Devi : చైత్ర న‌వ‌రాత్రి 9 రోజుల్లో దుర్గా మాత‌లంద‌రిని పూజిస్తూ ఉంటారు. ఇందులో న‌వ‌రాత్రి నాలుగ‌వ‌రోజు కూష్మాండ దేవిని పూజిస్తారు. కూష్మాండ దేవినా ఆరాధించ‌డం వ‌ల్ల ఆ త‌ల్లిని ద‌ర్శించ‌డం వ‌ల్ల క‌ష్టాల నుండి విముక్తి క‌లుగుతుంద‌ని న‌మ్ముతారు. ఈ తల్లిని ఆరాధించిన భ‌క్తుల‌కు మోక్షాన్ని కూడా అందిస్తుంది. భ‌క్తుల‌ను క‌ష్టాల నుండి దూరం చేసే ఈ కుష్మాండ త‌ల్లి ఆల‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుష్మాండ త‌ల్లి దేవాల‌యాల‌ల్లో విభిన్న‌మైన శోభ క‌నిపిస్తుంది. ఈ దేవాల‌యాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ల‌తో పాటు దేవాల‌యాల్లో కొన్ని ర‌హ‌స్యాలు కూడా ఉన్నాయి. ర‌హస్యాల‌ను ఇప్ప‌టికి ఎవ‌రూ క‌నుగొన‌లేదు. న‌వ‌రాత్రి స‌మ‌యంలో ఈ దేవాల‌యాల‌కు భ‌క్తుల రాక ఎక్కువ‌గా ఉంటుంది. కూష్మాండ దేవి ఆల‌యం బ‌నార‌స్ లోని రామ్ న‌గర్ లో ఉంది. సుబాహు అనే రాజు క‌ఠోర‌మైన త‌పస్సు చేసి ఆ దేవ‌త త‌న రాజ‌ధాని వార‌ణాసిలో అదే పేరుతో నివాసించాల‌ని వ‌రాన్ని కోరిన‌ట్టు ఇక్క‌డి స్థ‌ల‌పురాణం చెబుతుంది.

అలాగే దేవాల‌యంలో ఉండే త‌ల్లి విగ్ర‌హం ఎవ‌రిచేత చేయ‌బ‌డ‌లేదని న‌మ్ముతారు. దుష్ట‌శ‌క్తుల నుండి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికే విగ్ర‌హం క‌నిపించింద‌ని న‌మ్ముతారు. ఈ దేవాల‌యానికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకుంటూ ఉంటారు. ఈ దేవాల‌యంలో చాలా ఎక్కువ సంఖ్య‌లో కోతులు ఉండ‌డం వ‌ల్ల ఈ ఆల‌యాన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. అదే విధంగా ఉత్త‌రాఖండ్ లోని రుద్ర‌ప్ర‌యాగ్ లోని అగ‌స్త్య‌ముని లోని సిల్లాగ్రామంలో కూష్మాండ దేవిని ఆనంద దేవ‌త‌గా పూజిస్తారు. సిల్లా గ్రామంలో అగ‌స్త్య మ‌హ‌ర్షి గ‌ర్భం నుండి కూష్మాండ దేవి జ‌న్మించింద‌ని న‌మ్ముతారు. అలాగే ఇక్క‌టి ప్ర‌జ‌లు కుమాసైన్ అనే పేరుతో కూడా త‌ల్లిని పూజిస్తారు. కూష్మాండ దేవి జ‌న‌నం గురించి ఇక్క‌డ ఒక చ‌క్క‌టి క‌థ ప్రాచుర్యంలో ఉంది. హియాల‌య ప్రాంతంలో రాక్ష‌సుల భ‌యం ఉన్న‌ప్పుడు, ఋషులు ఆశ్ర‌మంలో పూజ‌లు చేయ‌లేమ‌ని చెబుతారు. శ‌నీశ్వ‌ర్ మ‌హారాజ్ ఆల‌యంలో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇక్క‌డికి పూజ‌కు వ‌చ్చిన ఒక బ్ర‌హ్మ‌ణుడిని రాక్ష‌సులు చంపేస్తారు. అప్పుడు శ‌నీశ్వ‌ర్ మ‌హారాజ్ త‌న సోద‌రుడు అగస్త్య మ‌హ‌ర్షిని స‌హాయం కోర‌తాడు.

Kushmanda Devi

త‌రువాత అగ‌స్త్య మహ‌ర్షి సిల్లా గ్రామానికి చేరుకుని పూజ‌లు చేయ‌డం ప్రారంభిస్తాడు. కానీ అత‌డు కూడా రాక్ష‌సుల‌కు భ‌య‌ప‌డ‌తాడు. అప్పుడు అగ‌స్త్య మ‌హ‌ర్షి ఆదిశ‌క్తి జ‌గ‌దాంబ‌ను ధ్యానం చేస్తాడు. అప్పుడు ఆ త‌ల్లి త‌న గ‌ర్భాన్ని రుద్ది కూష్మాండ‌కు జ‌న్మ‌నిస్తుందని ఇలా కూష్మాండ దేవి జ‌న్మించింద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు న‌మ్ముతారు. అలాగే ఉత్త‌ర‌ప్రదేశ్ లోని కాన్పూర్ లో కూడా పురాత‌న కూష్మాండ దేవి ఆల‌యం ఉంది. ఇక్క‌డ త‌ల్లి పిండి రూపంలో ఉంటుంది. ఆల‌యంలో ప్ర‌తిష్టించిన విగ్ర‌హాలు రెండ‌వ శ‌తాబ్దం నుండి ప‌ద‌వ శ‌తాబ్దానికి చెందిన‌విగా చెబుతారు. అలాగే ఈ ఆల‌యాన్ని కుధ అనే గోవుల కాపరి పెట్టాడ‌ని చెబుతారు. పొదలో ఉన్న త‌ల్లికి ఆవు త‌న పొదుగు నుండిపాల‌ను ఇస్తుండ‌గా గోర‌క్ష‌కుడు చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. అలాగే అక్క‌డ త‌వ్వి చూడ‌గా కూష్మాండ దేవి విగ్ర‌హం కనిపించింది కానీ దానికి ముగింపు క‌నిపించ‌లేదు. దీంతో ఆఆవుల కాప‌రి అక్క‌డే గుడిని క‌ట్టి కూష్మాండ దేవిని పూజించ‌డం ప్రారంభించాడు. అలాగే ఈ ఆల‌యంలో పిండి రూపంలో ఉండే కూష్మాండ దేవి నుండి ఎప్పుడూ నీరు కారుతూ ఉంటుంది. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల ఎటువంటి రోగాల నుండైన విముక్తి క‌లుగుతుంద‌ని న‌మ్ముతారు. న‌వ‌రాత్రి స‌మ‌యంలో ఇక్క‌డికి పెద్ద‌సంఖ్యలో భ‌క్తులు వ‌చ్చి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటూ ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM