ఇండియ‌న్ రైల్వేస్ రిక్రూట్‌మెంట్ 2021: 8వ త‌ర‌గ‌తి చ‌దివిన వారికి రైల్వే ఉద్యోగాలు.. జీతం రూ.18వేల నుంచి మొద‌లు..

August 4, 2021 10:40 PM

భార‌తీయ రైల్వేకు చెందిన ఇండియ‌న్ రైల్వేస్ రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్ సెంట్ర‌ల్ రైల్వేస్ ప‌రిధిలో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల‌కు ఔత్సాహికులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1664 పోస్టుల‌ను వివిధ విభాగ‌ల్లో భ‌ర్తీ చేయ‌నున్నారు.

Indian Railways Recruitment 2021 Class 8 Pass Candidates Can Apply

ఈ ఉద్యోగాల‌కు గాను ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 2న ప్రారంభం అయింది. సెప్టెంబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఇచ్చారు. ఆస‌క్తి ఉన్న‌వారు అధికారిక వెబ్‌సైట్ rrcpryi.org ను సంద‌ర్శించి ఆ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఈ ఉద్యోగాల‌కు విభాగాన్ని బ‌ట్టి రూ.18వేల నుంచి రూ.56,900 వ‌ర‌కు వేత‌నాన్ని అందిస్తారు.

ఇక సెప్టెంబ‌ర్ 1, 2021 వ తేదీ వర‌కు అభ్య‌ర్థుల వ‌య‌స్సు 24 ఏళ్లు మించ‌కూడ‌దు. అభ్య‌ర్థులకు వ‌యో ప‌రిమితిలో చ‌ట్టాల‌ను అనుస‌రించి స‌డ‌లింపులు ఇస్తారు. కొన్ని ఉద్యోగాల‌కు ఇంటర్ చ‌దివి ఉండాలి. కొన్ని పోస్టుల‌కు 8వ తర‌గ‌తి పాస్ అయి ఉంటే చాలు. ఐటీఐ చేసిన‌వారు కూడా ఈ ఉద్యోగాల‌కు అప్లై చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment