Buckwheat : దీని ముందు ఏవీ ప‌నికి రావు.. ఒంట్లో వేడి చిటికెలో పోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

September 30, 2022 9:10 PM

Buckwheat : బక్ వీట్.. గురించి మనలో చాలా మందికి తెలియదు. మంచి రుచి కలిగిన ఈ బక్ వీట్ పిండి ఒక పండు విత్తనాల నుండి తయారుచేస్తారు. సాధారణమైన గోధుమ పిండికి  ప్రత్యామ్నాయంగా ఈ పిండి వాడతారు. బక్ వీట్ పిండి సూపర్ మార్కెట్ లో లభ్యం అవుతుంది. దీని ధర కేవలం 150 రూపాయలలోపు ఉంటుంది. గోధుమల‌ను పుల్కాల‌ రూపంలో గాని లేదా అన్నం రూపంలో గాని తీసుకున్నప్పుడు  డయాబెటిస్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కానీ బక్ వీట్ ని గోధుమలకు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఈ బక్ వీట్ ని పిండి చేసుకొని రొట్టెలు, దోశ‌లు వంటి వాటిని చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బక్ వీట్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా, గ్లూటెన్ రహితంగా ఉంటుంది. బక్ వీట్ తృణధాన్యం కాకపోయినా దీనిని ఒక తృణధాన్యం లాగా చెబుతారు. దీనిలో రుటిన్ అనే ఫైటోన్యూట్రియెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెకు రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

amazing health benefits of taking Buckwheat
Buckwheat

ఈ బక్ వీట్ అనేది డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది. దీనిలో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల‌ హెచ్చు తగ్గులను నియంత్రిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. దీనిలో 12 రకాల అమైనో ఆమ్లాలు ఉండుట వలన కండరాల దృఢంగా  మరియు పెరుగుదలకు సహాయపడుతుంది. సెలీనియం మరియు జింక్ ఉండుట వలన వయస్సు పెరిగే కొద్ది  ఎముకలలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

ఈ బక్ వీట్ లో విటమిన్ ఇ మరియు మెగ్నీషియం ఉండుట వలన ఇవి రెండూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి శ్వాసనాళాలు వాపును తగ్గించి ఆస్తమా నివారణలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యలు దరిచేరనివ్వకుండా చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment