Red Rice : రెడ్ రైస్‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

September 10, 2022 8:07 AM

Red Rice : బియ్యం అనగానే మనకు ముందుగా వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్  ఈ రెండే గుర్తుకువస్తాయి. ఈ మధ్యకాలంలో వైట్ రైస్, బ్రౌన్ రైస్ తో పాటు రెడ్ రైస్, బ్లాక్ రైస్ ను తినడానికి కూడా ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. రెడ్ రైస్ లో ఆంథోసయనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ పుష్కలంగా ఉండటం వలన ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. రెడ్ రైస్ ను నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

ఈ బియ్యంలో పీచు, ఇనుము వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెడ్ రైస్ ఎంతో మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ బియ్యంలో ఫైబర్  అధికంగా ఉండటం వలన త్వరగా ఆకలి వేయదు. విటమిన్‌ బి1, బి12, ఐరన్‌, జింక్‌, పొటాషియం, కాల్షియం, సోడియం, మాంగనీస్ వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.  రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. దీంతో ఎర్రబియ్యం రెగ్యులర్ గా తిన్నవారికి కొండలాంటి బాన పొట్టను కూడా కరిగిస్తుంది.

take Red Rice regularly for these amazing benefits
Red Rice

ఈ రెడ్ రైస్‌లో క్యాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఎముకలు పుష్టిగా, దృఢంగా తయారవుతాయి. ఎర్రబియ్యం షుగర్ పేషేంట్స్ కి, గుండె వ్యాధి ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తెల్ల బియ్యం తినే కన్నా రెడ్ రైస్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ రైస్ లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిల‌ను త్వ‌ర‌గా పెర‌గ‌నివ్వ‌దు. ఈ రెడ్ రైస్ లో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన శరీరం ఆక్సిజన్ ని ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు రెడ్ రైస్  తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment