Thyroid Foods : థైరాయిడ్ సమస్యను మాయం చేయడానికి అద్భుతమైన ఆహారం ఏంటో తెలుసా..?

August 28, 2022 11:18 AM

Thyroid Foods : ప్రస్తుతకాలంలో మారుతున్న జీవన శైలిని బట్టి నూటికి ఎనభై శాతం మంది థైరాయిడ్ గ్రంథి సమస్యకు లోనవుతున్నారు. థైరాయిడ్ గ్రంథి అనేది గొంతు ప్రాంతంలో ఉంటుంది. ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. కానీ ఈ చిన్న పరిమాణంలో ఉండే థైరాయిడ్ గ్రంథి హార్మోనులను విడుదల చేస్తూ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అనేక వ్యాధుల నుండి రక్షించడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి ఎక్కువగా పని చేస్తే హైపర్ థైరాయిడిజం అని, చాలా నెమ్మదిగా పని చేస్తే హైపో థైరాయిడిజం అని అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ శరీరంలో అవాంతరాలు తలెత్తుతాయి. ఎప్పుడైతే మనకు థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయదో మన శరీరంలో అనేక మార్పులు ఎదురవటం జరుగుతుంది.

అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహార నియమాలు పాటించడం ఎంతో ఉత్తమం. థైరాయిడ్ ఉన్నవారికి నీరసం, అలసట, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచేందుకు ఐరన్, మెగ్నిషియం, జింక్, అయోడిన్, విటమిన్ బి, సి, డి, సెలీనియం వంటి పోషకాలు చాలా అవసరం. ఈ పోషకాలు కలిగిన ఆహారాల‌ను తీసుకుంటే థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది.

Thyroid Foods you should take them daily to be in control
Thyroid Foods

థైరాయిడ్ సమస్య ఉన్నవారు పెసలను రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. పెసలను నానబెట్టి మొలకలుగా తీసుకుంటే మీ శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. పెసలలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల త్వరగా జీర్ణం అవుతాయి. అలాగే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, మినరల్స్ వంటివి పుష్కలంగా అందడంతోపాటు థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారికి మలబద్దకం సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి పెసల‌ను నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా మలబద్దకం సమస్య దూరమవుతుంది. థైరాయిడ్ సమస్య అదుపులో ఉండాలంటే శరీరానికి అవసరమైనంత నీరు, తగినంత నిద్ర ఎంతో అవసరం. అదేవిధంగా రోజుకి అరగంట వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితం ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment