Roja : మంత్రిగా ఉండి డ్యాన్స్‌లు వేస్తావా.. రోజాపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం.. వీడియో..

August 16, 2022 8:05 AM

Roja : ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా కుర్రకారును ఓ ఊపు ఊపిపేసిన రోజా ఇటీవ‌ల టీవీ షోలకు జడ్జిగా వ్య‌వ‌హ‌రించారు. రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్ గా మారారు. మంత్రి అయిన త‌ర్వాత పూర్తిగా ప్ర‌జ‌ల్లోనే తిరుగుతూ వ‌స్తున్నారు. మినిస్టర్ అయినా.. తనకు నచ్చిన పాట వింటే మాత్రం తగ్గేదే లే అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నాడు చేసిన ఆ పాట రోజా హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నా.. ఆ పాటకు తాజాగా వేసిన స్టెప్పులు చూస్తే అసలు రోజా బయటకు వచ్చేశారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న హంసధ్వని తొమ్మిదవ వార్షికోత్సవ ముగింపు సభకు మంత్రి రోజా హాజరయ్యారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడంతో రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ ద్వారా మూడు రోజుల పాటు అక్కడ ధ్యాన, నాట్య, సంగీత ప్రదర్శనలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అక్కడ చామంతి పువ్వా.. పువ్వా.. అంటూ తన హిట్ సాంగ్‌ ప్లే చేస్తే మంత్రి రోజా డైరెక్టర్ స్వాతి సోమనాథ్ తో కలిసి డాన్స్ చేశారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి రోజా.. తన డ్యాన్సుతో అలరించారు. రోజాతోపాటు అక్కడ ఉన్న వారు కూడా డాన్స్ చేయడంతో ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

Roja danced for her movie song netizen angry
Roja

మంత్రిగా ఉంటూనే స్టెప్పులు వేయడంపై ఆనందిస్తూ.. అభినందించిన వారు కొందరైతే.. మంత్రిగా ఉంటూ ఆ స్టెప్పులు ఏంటంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రోజాకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం పరుగుల తీస్తున్న పిల్లలు ఒత్తిడిని జయించడానికి మంచి కళలు, సంగీతం, నాట్యం ఉపయోగపడతాయని హితబోధ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by sumanagesh (@sumanageshpaina)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment