Chinmayi : సింగ‌ర్ చిన్మ‌యిపై ట్రోలింగ్‌.. ప్ర‌స‌వంపై నెటిజ‌న్ల అనుమానాలు..?

June 23, 2022 8:43 AM

Chinmayi : సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ దంప‌తుల‌కు క‌వ‌ల‌లు జ‌న్మించిన విష‌యం విదిత‌మే. తాజాగా వారు త‌మ పిల్ల‌ల‌ను త‌మ జీవితాల్లోకి ఆహ్వానించారు. ఈ క్ర‌మంలోనే వారి పూర్తి ఫొటోల‌ను షేర్ చేయ‌కుండా.. చేతులు ప‌ట్టుకున్న ఫొటోల‌ను దిగి షేర్ చేశారు. దీంతో వారికి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే చిన్మయి అంటేనే చాలా మంది నెటిజ‌న్లు ట్రోలింగ్ మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలోనే ఆమె పెట్టిన పోస్టుల‌పై మ‌ళ్లీ ట్రోలింగ్ మొద‌లైంది.

సింగ‌ర్ చిన్మ‌యి గ‌ర్భం ధ‌రించిన‌ట్లుగా ఉన్న ఫొటోలు ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. మ‌ర‌లాంట‌ప్పుడు ఆమెకు జ‌న్మించిన ఈ పిల్ల‌ల‌ను ఆమెను క‌న్న‌దా.. లేక స‌రోగ‌సీ ద్వారా వాళ్ల‌ను క‌న్న‌దా.. అంటూ నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. చాలా మంది ఆమెకు డైరెక్ట్ మెసేజ్‌ల‌ను కూడా పంపిస్తున్నారు. అయితే దీనిపై చిన్మ‌యి స్పందించింది.

netizen troll Chinmayi for her latest posts
Chinmayi

త‌న ప్ర‌స‌వంపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయ‌ని చిన్మ‌యి తెలియ‌జేసింది. అయితే త‌న గ‌ర్భం ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో కావాల‌నే పోస్ట్ చేయ‌లేద‌ని.. అంత‌మాత్రాన త‌న‌కు పిల్ల‌లు పుడితే స‌రోగ‌సీ ద్వారా క‌న్నాన‌ని ఎలా అంటార‌ని ప్ర‌శ్నించింది. తాను ప్ర‌స‌వం స‌మ‌యంలో త‌న పిల్ల‌ల సేఫ్టీ కోసం భ‌జ‌న మంత్రాల‌ను చ‌దివాన‌ని చెప్పింది. అంతేకాదు.. వారి ఫొటోల‌ను కూడా ఇప్పుడ‌ప్పుడే సోష‌ల్ మీడియాలో పెట్ట‌లేన‌ని.. త‌మ‌కు ప్రైవ‌సీ కావాల‌ని ఆమె కోరింది. ఈ క్ర‌మంలోనే చిన్మ‌యి కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment