Samantha : విడాకుల గురించి మ‌ళ్లీ మ‌ళ్లీ అడ‌గ‌కండి, మాట్లాడాల‌ని లేదు..!

December 12, 2021 4:21 PM

Samantha : అక్కినేని నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత పలు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఆమె ఎప్పుడైతే సోష‌ల్ మీడియా వేదిక‌గా విడాకుల విష‌యం ప్ర‌క‌టించిందో అప్ప‌టి నుండి స‌మంత‌పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్‌.. మొదటిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించిన విషయం తెలిసిందే.

Samantha said not to ask about divorce again

విడిపోయిన సమయంలో తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని, చనిపోవాలనుకున్నానని ఆమె అన్నారు. 2021.. తనకి వ్యక్తిగతంగా కలిసి రాలేదని ఆమె తెలిపారు. తాజాగా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకకు హాజరైన ఆమె.. ‘ఈటైమ్స్’తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై స్పందించింది.

విడాకుల విషయం గురించి చెప్పదలచుకున్నదంతా చెప్పేశాను. ఎందరో ఎన్నో అనుకున్నారని, అప్పుడే దానిపై మాట్లాడాలని భావించి మాట్లాడేశానని తెలిపింది. కాబట్టి మళ్లీ మళ్లీ దాని గురించే మాట్లాడాలనుకోవట్లేదని ఆమె తేల్చి చెప్పింది. ఆ విష‌యం మ‌రోసారి అడ‌గొద్దంటూ స‌మంత సున్నితంగా హెచ్చ‌రించిన‌ట్టు కూడా తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2లోని బోల్డ్ సీన్స్ పైనా ఆమె మాట్లాడింది. సిరీస్ రిలీజ్ కాకముందు ఎన్నో అనుకున్నారని, కానీ, అది విడుదలయ్యాక అందరికీ తెలిసొచ్చిందని చెప్పింది. స్వేచ్ఛా జీవిగా ఉండే పాత్ర అని తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment