Weight Loss Drink : ఈ పొడిని రోజుకు అర టీస్పూన్ తీసుకోండి చాలు.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Weight Loss Drink : మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు అధిక రక్తపోటు, డయాబెటిస్, బరువు పెరగడానికి దారి తీస్తున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు.

చెడు ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని స్వయానా మనమే నాశనం చేసుకుంటున్నాం. దీనికి ఫలితంగా మానసిక ఒత్తిడి, అధిక బరువు వంటి సమస్యల బారినపడుతున్నారు. రోగాల బారిన పడుతూ వేలకు వేలు డబ్బులు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఒత్తిడి, జీవనశైలి, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, హార్మోన్స్ లో అసమతుల్యత ఇలా ఎన్నో రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే  మన బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Weight Loss Drink

బరువు తగ్గటానికి ప్రతి రోజు అరగంట అయినా వ్యాయామం చేయాలి. ఇప్పుడు చెప్పే పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకున్న  కొవ్వు కరగడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ పాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

పొయ్యి వెలిగించి మందపాటి  పాన్ పెట్టి దానిలో ఒక స్పూను వాము, నాలుగు యాలకులు, ఒక స్పూను సోపు గింజలు, అంగుళం దాల్చిన చెక్క, ఒక స్పూన్ మిరియాలు వేసి మంచి ఫ్లేవర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన పదార్థాలు చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో ఒక స్పూన్ అశ్వగంధ పొడి, ఒక స్పూన్ శొంఠి పొడి, మూడు టీస్పూన్ల బాదం పొడి, ఒక స్పూను ఆర్గానిక్ పసుపు, రుచికి సరిపడా పటిక బెల్లం ముక్కలను వేసి మరలా ఈ మిశ్రమాన్ని  మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడ‌ని గాజు సీసాలో నిల్వ చేసి ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నెల రోజులపాటు నిల్వ ఉంటుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో పైన త‌యారు చేసిన అర టీస్పూన్ పొడిని వేసి బాగా కలిపి ఉదయం సమయంలో త్రాగటం ద్వారా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు క్రమంగా కరిగి బరువు తగ్గుతారు. మోకాళ్ళ నొప్పులు తగ్గి ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ పాలను రాత్రి సమయంలో తాగితే హాయిగా నిద్ర పడుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క‌నుక ఈ పొడిని పాల‌తో రోజూ తీసుకోవాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM

ఎస్‌బీఐలో 2050 భారీ ఉద్యోగాలు: నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలివే!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…

Thursday, 29 January 2026, 2:43 PM

విజయ్ ‘జన నాయకన్’ వివాదానికి చెక్..? కోర్టు బయటే రాజీ..? రిలీజ్‌పై తాజా అప్‌డేట్!

తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…

Thursday, 29 January 2026, 12:36 PM