గురువారం, జూన్ 11, 2026
వినోదం

Prithviraj Sukumaran : ఈ మధ్య వచ్చిన బెస్ట్ మూవీ ఇది.. మిస్ అయ్యుంటే చూసేయండి..!

Prithviraj Sukumaran : వరుస పెట్టి, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని మంచి సినిమాలను, చాలామంది మిస్ అయిపోతున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఈయన అందరికీ సుపరిచితమే. పలు డబ్బింగ్ సినిమాల…

Prithviraj Sukumaran : ఈ మధ్య వచ్చిన బెస్ట్ మూవీ ఇది.. మిస్ అయ్యుంటే చూసేయండి..!

Prithviraj Sukumaran : వరుస పెట్టి, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని మంచి సినిమాలను, చాలామంది మిస్ అయిపోతున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఈయన అందరికీ సుపరిచితమే. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా పృథ్విరాజ్ తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఆయన నటించిన, సినిమాలలో జనగణమన ఒకటి ఈ మూవీ మలయాళం లో రిలీజ్ అయి, సూపర్ హిట్ అయింది. విమర్శకులు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో, ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా స్టోరీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పృధ్విరాజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ లో విలన్ గా నటిస్తున్నారు. ఆయన నటించిన జనగణమన సినిమా 2022లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో మమతా మోహన్ దాస్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కథ గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్) ని అత్యాచారం చేస్తారు. ఆ తరవాత, ఆమె బాడీని కాల్చి రోడ్డు పక్కన పడేస్తారు. ఆమె పనిచేసిన యూనివర్సిటీ విద్యార్ధులు లెక్చరర్ కి న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతారు.

Prithviraj Sukumaran latest movie trending on ott
Prithviraj Sukumaran

సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాడుతుంది. ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) రంగంలో దిగుతాడు.ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యంతో నలుగురు నిందితులను పట్టుకుంటాడు. సొసైటీ నుండి నిందితులను చంపేయాలి అని డిమాండ్ వస్తుంది. పై నుంచి ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏసీపీ సజ్జన్ స్టేషన్ కు తరిలించే సమయంలో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాడు.

దీని మీద హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు పెడుతుంది. కేసులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఏసీపీ సజ్జన్ కి వ్యతిరేకంగా కేసు వాదిస్తాడు. నెక్స్ట్ ఏం అవుతుంది..? అరవిందన్ ఎవరు…? ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు..? సభా మరియం ఎందుకు చనిపోయారు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.