గురువారం, జూన్ 11, 2026
వినోదం

Prabhas And Anushka : మళ్ళీ అనుష్క, ప్రభాస్ పెళ్ళి వార్తలు.. ఈసారైనా నిజమేనా..?

Prabhas And Anushka : టాలీవుడ్ లో ఉన్న, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటారంటూ, ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే,…

Prabhas And Anushka : మళ్ళీ అనుష్క, ప్రభాస్ పెళ్ళి వార్తలు.. ఈసారైనా నిజమేనా..?

Prabhas And Anushka : టాలీవుడ్ లో ఉన్న, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటారంటూ, ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే, విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటారు. గత 12 ఏళ్ళు, 13 ఏళ్లగా ప్రభాస్ అనుష్క డేటింగ్ వార్తలు వస్తూనే ఉన్నాయి. 2009లో రిలీజ్ అయిన బిల్లా సినిమాలో అనుష్క ప్రభాస్ కలిసి మొట్టమొదట నటించారు. ఆ టైంలోనే వాళ్ళు లవ్ లో పడ్డారని పుకార్లు వచ్చాయి. అప్పటినుండి కూడా ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ. ఆ వార్తలు నిజం కాలేదు.

ఇప్పటికి ప్రభాస్ పెళ్లి అంటే మొట్టమొదట గుర్తు వచ్చేది అనుష్కనే. అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారా అని ఆరా తీయడం మొదలు పెడుతుంటారు. అయితే వాళ్ళు స్నేహితులు మాత్రమే అని, చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రభాస్ అనుష్క ఈ విషయంపై ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చేసినా సరే, ఫ్యాన్స్ లో మాత్రం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనేది బలంగా నాటుకు పోయింది. తాజాగా మరోసారి ప్రభాస్, అనుష్క పెళ్లి వార్తలు వచ్చాయి.

Prabhas And Anushka their marriage news viral again
Prabhas And Anushka

ఇటీవలే ప్రభాస్ 44వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయనకి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ప్రభాస్ కి తగ్గ పెళ్లి కూతుర్ని వెతకడం కంటే, అనుష్క తోనే అతని ఇచ్చి పెళ్లి చేసేయచ్చు కదా అని, కుటుంబ సభ్యులు అనుకుంటున్నాట్లు సమాచారం.

త్వరలోనే ప్రభాస్, అనుష్క పెళ్లికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ కల్కి 2898 సినిమా చేయబోతున్నారు. అలానే, మారుతి దర్శకత్వంలో, ఒక సినిమా చేయడానికి కూడా ప్రభాస్ ఒప్పుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.