గురువారం, జూన్ 11, 2026
వినోదం

Mama Machindra OTT Release Date : ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న మామా మ‌శ్చీంద్ర.. ఎప్పుడు వస్తోంది అంటే..?

Mama Machindra OTT Release Date : ఈరోజుల్లో చాలామంది ఓటీటీ లోనే కొత్త సినిమాలు చూస్తున్నారు. థియేటర్లకి వెళ్లడం కూడా చాలామంది మానేశారు. ఓటీటీ లో ఎప్పుడు, ఏ సినిమా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇక…

Mama Machindra OTT Release Date : ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న మామా మ‌శ్చీంద్ర.. ఎప్పుడు వస్తోంది అంటే..?

Mama Machindra OTT Release Date : ఈరోజుల్లో చాలామంది ఓటీటీ లోనే కొత్త సినిమాలు చూస్తున్నారు. థియేటర్లకి వెళ్లడం కూడా చాలామంది మానేశారు. ఓటీటీ లో ఎప్పుడు, ఏ సినిమా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇక తాజాగా ఓటీటీ లో ఒక సినిమా రాబోతోంది. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. సుధీర్ బాబు హీరోగా మామా మ‌శ్చీంద్ర సినిమా రాబోతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడో రోజే సుధీర్ బాబు మామా మ‌శ్చీంద్ర సినిమా ని అనౌన్స్ చేసేసారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.

ఇక పూర్తి వివరాలను చూస్తే… అక్టోబ‌ర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో మామా మ‌శ్చీంద్ర స్ట్రీమింగ్ కాబోతోంది. క‌నీసం రెండు వారాలు కూడా గ్యాప్ లేకుండా మూవీ ని అనౌన్స్ చేసేసారు. మామా మ‌శ్చీంద్ర మూవీ కి నెగెటివ్ టాక్ వచ్చింది. చిన్న సినిమాల భారీ పోటీ మ‌ధ్య ఈ మూవీ వచ్చింది. కానీ మంచి రెస్పాన్స్ అయితే రాలేదు. ఈ మూవీ లో సుధీర్‌బాబు త్రిబుల్ రోల్‌ లో నటించారు.

Mama Machindra OTT Release Date
Mama Machindra OTT Release Date

న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు వచ్చాయి కానీ క‌థ‌లో క‌న్ఫ్యూజ‌న్ ఎక్కువ వుంది. స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డంతో అస్సలు సినిమా ఆడలేదు. న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈషారెబ్బా, మృణాళిని హీరోయిన్లుగా కనపడి ఆకట్టుకున్నారు. ఇక కథ విషయానికి వస్తే.. ఆస్తి కోసం ప‌ర‌శురామ్ (సుధీర్‌బాబు) అసిస్టెంట్ దాసు (హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌) సాయం తో త‌న సొంత చెల్లెలిని చంపాల‌ని అనుకుని మొదలు పెడతాడు. కానీ వర్క్ అవుట్ అవ్వదు.

చాలా ఏళ్ల త‌ర్వాత దుర్గ (సుధీర్ బాబు) అనే రౌడీ, హైద‌రాబాద్‌కు చెందిన డీజే (సుధీర్ బాబు) ప‌ర‌శురామ్ పోలిక‌ల‌తోనే తార‌స‌ప‌డ‌తారు. ప‌ర‌శురామ్‌తో సంబంధం ఏమిటి…? ప‌ర‌శురామ్ కూతురు విశాల‌క్ష్మి (ఈషారెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని) ఎవరు ప్రేమించారు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.